క్రీడాభూమి

దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్జింగ్ (చైనా): ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ టోర్నీలో బుధవారం పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లు అనూహ్య విజయంతో ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. వరల్డ్ నెంబర్ 11 హెచ్‌ఎస్ ప్రణయ్ మాత్రం బ్రెజిలియన్ షట్లర్ వైగోర్ కోయెల్హో చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో బై సాధించి రెండో రౌండ్‌లో ఇండోనేసియా ప్రత్యర్థి ఫిట్రియానితో తలపడిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సునాయాస (21-14, 21-9) విజయంతో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదే టోర్నీలో గతేడాది రజిత పతకం సాధించిన 23 ఏళ్ల టాప్ షట్లర్ తదుపరి రౌండ్‌లో 2015 వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ కాంస్య పతక విజేత, కొరియన్ షట్లర్ సుంగ్ జి హ్యుయాన్‌ను ఎదుర్కోనుంది. రెండో రౌండ్‌లో స్పెయిన్ షట్లర్ పాబ్లో అభియాన్‌ను ఎదుర్కొన్న 5వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ గంటపాటు ఉత్కంఠ పోరు తరువాత (21-15, 12-21, 21-14) విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్‌లో 2012 ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ విజేత, మలేసియా షట్లర్ డారెన్ ల్యూతో తలపడనున్నాడు. బి సాయిప్రణీత్ సైతం స్పెయిన్ ఆటగాడు లూరుూస్ ఎన్రిక్ పెనల్వెర్‌ను (21-18, 21-11) మట్టికరిపించి సునాయాస విజయం అందుకున్నాడు. తదుపరి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన హన్స్-క్రిస్టీన్ సోల్బెర్గ్ విట్టింగుస్‌తో తలపడతాడు. 11వ సీడెడ్ ప్రణయ్ తొలి సెట్‌లో (21-8) ఆధిక్యాన్ని చూపినా, మిగిలిన రెండు సెట్లలో (16-21, 15-21) ప్రత్యర్థి కోల్హో ముందు తలొంచి అపజయాన్ని మూటగట్టుకున్నాడు. భారత డబుల్స్ జట్లు సైతం బుధవారం పోరాట ప్రదర్శన కనబర్చలేక ప్రత్యర్థుల ముందు ఓటమి అంగీకరించాయి. కామనె్వల్త్ గేమ్స్ రజిత పతక విజేతలు సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టిలు డెన్మార్క్‌కు చెందిన ప్రత్యర్థి జట్టు కిమ్ ఆస్ట్రుప్, ఆండ్రెస్ స్కారప్ రస్ముస్సెన్‌పై తీవ్ర పోరాటంతో (18-21, 21-15, 16-21)తో ఓటమి చవిచూశారు. అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డి ద్వయం జపాన్ జట్టుపై 14-21, 15-21తో ఓడటం తెలిసిందే. మెన్స్ డబుల్స్‌లో జాతీయ చాంపియన్ మను అత్రి, బి సుమీత్ రెడ్డి జోడీ జపాన్‌కు చెందిన టకుటో ఇనౌ, యుకి కనెకో చేతిలో 24-12, 13-21, 16-21 స్కోరుతో ఓడిపోయారు. మ్యాచ్ అనంతరం కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఆట సరిగ్గానే మొదలుపెట్టి అనుకోకుండా జరిగిన తప్పులు ప్రత్యర్థికి అడ్వాంటేజ్‌గా మారాయి. కోచ్ సలహా తీసుకున్న అనంతరం తప్పులను సరిదిద్దుకుని ఆటపై నియంత్రణ సాధించడానికి కొంచెం సమయం పట్టింది. చివరి సెట్ గేమ్ నాకు సంతృప్తినిచ్చింది. తదుపరి మ్యాచ్‌లో పొరబాట్లు చేయకుండా జాగ్రత్తపడతా’ అన్నాడు. టోర్నీ నుంచి నిష్క్రమించిన ప్రణయ్ మాట్లాడుతూ ‘రెండు, మూడు సెట్లలో పుంజుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నా ప్రయత్నాలను ప్రత్యర్థి బలంగా తిప్పికొట్టాడు. ఈ రోజు నా డిఫెన్స్ సైతం సంతృప్తికరంగా లేదు. ప్రత్యర్థి గెలుపునకు నేనే అనేక అవకాశాలు ఇచ్చాను’ అన్నాడు. ‘్ఫస్ట్ గేమ్‌లో బాగానే ఆడినా, సెకెండ్ గేమ్‌లో నేనిచ్చిన అవకాశాలను ప్రత్యర్థి లీడ్‌గా మార్చుకున్నాడు. నా మిస్టేక్స్ అతనికి నమ్మకాన్ని పెంచాయి. సాధ్యమైనంత వరకూ ఈ మ్యాచ్‌ను త్వరగా మర్చిపోయి, ఆసియా గేమ్స్‌పై దృష్టిపెడతా’ అని ప్రణయ్ వ్యాఖ్యానించాడు.