క్రీడాభూమి

కౌంటీ క్రికెట్ లాభించింది:అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, ఆగస్టు 2: ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడడం తనకు లాభించిందని ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్ తీరుతెన్నులపై ఒక అవగాహనకు రాగలిగానని ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పాడు. గత ఏడాది కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు, బౌలర్లు వేగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థమైందని అన్నాడు. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ పిచ్‌లు ఉన్నందువల్ల వేగం కీలకంగా మారుతుందని తెలిపాడు. సాధ్యమైనంత వరకూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం, బౌలింగ్ వేరియేషన్స్‌తో వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నించడమే లక్ష్యంగా బంతులు వేసినట్టు చెప్పాడు. కౌంటీ క్రికెట్ అనుభవం కూడా ఉపయోగపడడంతో, సంతృప్తికరమైన బౌలింగ్ విశే్లషణ నమోదైందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత టెస్టు ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని జోస్యం చెప్పాడు.
చైనా టూర్‌కు నేమార్
షెన్‌జింగ్, ఆగస్టు 2: బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ మళ్లీ క్లబ్ కెరీర్‌ను కొనసాగించేందుకు నడుం బిగించాడు. బార్సిలోనా నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కు రికార్డు ధరతో వెళ్లిన నేమార్ గత సీజన్‌లో గాయపడి, శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అతను వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఆడడం అనుమానంగానే కనిపించింది. కానీ, పూర్తిగా కోలుకున్న నేమార్ వరల్డ్ కప్‌లో ఆడాడు. అయితే, తన జట్టుకు ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోయాడు. రష్యాలో వరల్డ్ కప్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన నేమార్ తిరిగి పీఎస్‌జీతో చేరాడు. చైనా పర్యటనలో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ టూర్‌తో అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.