క్రీడాభూమి

తప్పుకున్న లక్ష్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హో చి మిన్ సిటీ, ఆగస్టు 6: వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ నుంచి భారత షట్లర్, ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య తప్పుకున్నాడు. మోకాలి కండరాల్లో తీవ్రమైన నొప్పి కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్టు మెంటార్, మాజీ జాతీయ కోచ్ విమల్ కుమార్ వెల్లడించాడు. ‘వియత్నాం టోర్నీ నుంచి లక్ష్య తప్పుకున్నాడు. ఆసియా జూనియర్ టోర్నీ నుంచి వచ్చిన దగ్గరి నుంచీ అతను మోకాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వైద్యులను సంప్రదిస్తే విశ్రాంతి మంచిదని సూచించారు. నొప్పికి ఉపశమనం లభించక పోవడంతో టోర్నీకి లక్ష్య వెళ్లడం లేదు’ అని విమల్ కుమార్ వెల్లడించాడు.