క్రీడాభూమి

ఆసియాకు చాను డౌటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వరల్డ్ చాంప్ మీరాబాయి చాను ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా సందేహాస్పదమే. వచ్చే ఒలింపిక్‌లో చాను పాల్గొనాలంటే, జకర్తా ఈవెంట్ నుంచి ఉపశమనం కలిగించడమే మంచిదని చీఫ్ కోచ్ విజయ్ శర్మ సిఫార్స్ చేస్తున్నాడు. కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ చాను గత మేనుంచి గుర్తించలేని కటి నొప్పితో ఇబ్బంది పడుతోంది. పూర్తిస్థాయి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు ఆమె సంసిద్ధం కాలేదన్నది కోచ్ చెబుతోన్న మాట. ‘ఫెడరేషన్‌కు నివేదిక ఇచ్చాం. తుది నిర్ణయం వాళ్లదే. భారీ బరువులు ఎత్తడానికి ఇప్పుడున్న సమయం సరిపోదన్నది నా నివేదిక. నవంబర్ 1నుంచి ఒలింపిక్ క్వాలిఫయిర్స్ ఈవెంట్లు మొదలవుతాయి. ఆసియా గేమ్స్‌కంటే ఒలింపిక్ ముఖ్యం’ అని శర్మ అంటున్నాడు. నొప్పినుంచి ఇపుడిపుడే ఉపశమనం పొందుతున్న చాను, ముంబయిలో ప్రాథమిక కసరత్తు మొదలెట్టింది. ఈ సమయంలోనే మరోసారి నొప్పి తీవ్రమవడంతో, ఆమె రిస్ట్ చేయడం మంచిది కాదని కోచ్ సూచిస్తున్నాడు. ‘చాను సమస్య వైద్యులకు సైతం అదండం లేదు’ అని శర్మ పేర్కొన్నాడు. ఇదిలావుంటే ఆసియా గేమ్సలో చాను పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై గురువారం ఫెడరేషన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఐడబ్ల్యుఎఫ్ కార్యదర్శి సహదేవ్ యాదవ్ వెల్లడించాడు.