క్రీడాభూమి

అద్గదీ.. విరాట్ వీక్నెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 6: ద్రోణాచార్యుడిని కుప్పకూల్చాలంటే ‘అశ్వద్థామ హతః’ సమాచారాన్ని ఆయన చెవిన వేయాలి. ఇది కురుక్షేత్ర సన్నివేశం. పరుగుల యంత్రం విరాట్‌ను కట్టడి చేయాలంటే జట్టును కుప్పకూల్చడం ఒక్కటే మార్గం. ఇది మలి టెస్ట్ కోసం ఇంగ్లీష్ జట్టు ప్రతిపాదించుకున్న నియమం. ఆశ్చర్యం అనిపించినా, ఇంగ్లాండ్ కోచ్ మాత్రం ఇదే నియమాన్ని పాటించమని జట్టుకు నూరిపోస్తున్నాడు. ‘జట్టును కుప్పకూల్చండి. విరాట్ ఆగిపోతాడు. వత్తిడితో తనంతట తానే కుప్పకూలిపోతాడు’ -ఇదీ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ ట్రెవోర్ బేలిస్ శిక్షణ ఆదేశం. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో సాగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల వద్ద అపజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్‌లో ఈనెల 9నుంచి మలి టెస్ట్ మొదలుకానున్న నేపథ్యంలో, ప్రాక్టీస్ మొదలెట్టిన ఇంగ్లీష్ జట్టుకు కోచ్ కొత్త క్లాస్ తీసుకున్నాడు. ‘టీమిండియా బలహీనత’లపై దృష్టి పెట్టమంటూ సూచిస్తున్నాడు. భారత పరుగుల యంత్రం విరాట్‌ను నేరుగా ఎదుర్కోవడంకంటే, జట్టు వెన్ను విరిచేయడమే సరైన మార్గమన్నది ఆయన కొత్త ప్రణాళిక. ‘కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ కాకపోయివుంటే, ఇంత పెద్ద ప్రణాళిక అవసరం ఉండేది కాదు. కానీ, అతను ఆడిన ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్స్ హైక్లాస్ స్ట్ఫ్. మిగిలిన బ్యాట్స్‌మెన్లపై వత్తిడి పెంచితే, అదే విరాట్‌పై తీవ్ర వత్తిడి అవుతుంది. మా పని సులువవుతుంది’ అని బేలిస్ వ్యాఖ్యానించాడు. ‘తొలి టెస్ట్‌లో- అటూ ఇటూ నాలుగు ఇన్నింగ్స్‌లోనూ వికెట్లు టపటపా రాలిపోయాయి. బ్యాట్స్‌మెన్లు అంతా ఇబ్బందులుపడ్డారు, ఒక్క కోహ్లీ తప్ప. అతనొక్కడే కంఫర్టబుల్‌గా ఆడాడు. అదెలా అన్నది ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యమే అనిపిస్తుంది. నిజానికి అతనున్న పరిస్థితుల్లో అంత స్థిరంగా బ్యాంటింగ్ చేయడం చాలా కష్టం. బయటినుంచి చూస్తున్నంత సులువు కాదు’ అంటూ జట్టుకు బేలిస్ ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్నాడు. ‘టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జరిగిన పొరబాట్లనుంచి త్వరగా పాఠాలు నేర్చుకోగల సత్తా ఆ జట్టుకి ఉంది. మలి టెస్ట్‌కు టీమిండియా అద్భుత ఫాంతోనే అడుగు పెడుతుందని అనుకుంటున్నా. దెబ్బతిన్న బెబ్బులిని గెలవాలంటే మన ఆటగాళ్లు మరింత పదును పెట్టుకోక తప్పదు’ అంటూ టీమిండియా సత్తాను ప్రశంసిస్తూనే ఇంగ్లీష్ జట్టుకి జాగ్రత్తలు చెబుతున్నాడు బేలిస్.