క్రీడాభూమి

ఏటీపీ ర్యాంకుల్లో నాదల్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పోర్ట్స్ డెస్క్: ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ టెన్నిస్) ప్రపంచ ర్యాంకుల్లో స్పెయిన్ సీడ్ రాఫెల్ నాదల్ తన నెం1 స్థానాన్ని నిలుపుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకుల్లో నాదల్ 9,310 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే, తరువాతి స్థానాన్ని స్విస్ ఆటగాడు రోగర్ ఫెదరర్ (7,080) ఆక్రమించాడు. మొన్నటి వింబుల్డన్ సెమీఫైనల్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ చేతిలో నాదల్ పరాజయానికి గురైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకుల్లో సౌతాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ వినా మిగిలిన టాప్ టెన్‌లోని ఆటగాళ్లు తమతమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఆండర్సన్ ఆరో స్థానానికి పడిపోవడంతో, బల్గేరియా ఆటగాడు గ్రిగర్ డిమిత్రోవ్ ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలావుంటే స్లొవాకియా ఆటగాడు మార్టిన్ క్లిజాన్ 35 స్థానాలు దిగజారి 77 ర్యాంకుకు పడిపోతే, వాషింగ్టన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినౌర్ 27 ర్యాంకులు అధిగమించి 45వ స్థానానికి చేరాడు. తాజాగా ఏటీపీ విడుదల చేసిన టాప్ టెన్ ర్యాంకుల్లో నాదల్ (స్పెయిన్, 9,310 పాయింట్లు), రోగర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్, 7,080), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ, 5,665), జాన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా, 5,455), గ్రిగర్ డిమిత్రోవ్ (బల్గేరియా, 4,610), కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా, 4,355), మార్టిన్ సిలిక్ (క్రొయేషియా, 3,905), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా, 3,665), జాన్ ఇస్నెర్ (యూఎస్‌ఏ, 3,490), నొవాక్ డెజోవిక్ (సెర్బియా, 3,355) ఉన్నారు.