క్రీడాభూమి

సమర్థుడు.. మార్గదర్శి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్‌ను సమర్థుడైన ఆటగాడని, తిరుగులేని నాయకుడని, యువ ఆటగాళ్లను ఉన్నత శిఖరాలకు నడిపించిన మార్గదర్శి అని పలువురు ప్రశంసించారు. వాడేకర్ మృతి చెందారన్న వార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కెప్టెన్లు మహమ్మద్ అజరుద్దీన్, అనిల్ కుంబ్లే, సచిన్ తెండూల్కర్ తదితరులు వ్యాఖ్యానించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాడేకర్ తన 77వ ఏట మృతి, బుధవారం మృతి చెందడం భారత క్రికెట్ రంగాన్ని శోక సంద్రంలో ముంచెత్తింది. వాడేకర్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన కాలంలో తమకు ఓ తండ్రిలా మార్గదర్శకం చేశాడని అజరుద్దీన్, కుంబ్లే అన్నారు. వాడేకర్ మృతి వార్త తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సచిన్ ట్వీట్ చేశాడు. తన క్రికెట్ కెరీర్‌ను తీర్చిదిద్దిన వారిలో వాడేకర్ ఒకడని అన్నాడు. అజరుద్దీన్ వరుస వైఫల్యాలతో అల్లాడుతూ, కెప్టెన్‌గానేగాక, ఆటగాడిగా కూడా జాతీయ జట్టులో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు వాడేకర్ అతనికి అండగా నిలిచాడన్నది వాస్తవమని అన్నాడు. అజర్ సైతం వాడేకర్‌ను ‘తండ్రి లాంటి వాడు’ అంటూ ఎంతో గౌరవంతో సంబోధించేవాడు.ప్రపంచ మేటి జట్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత జట్టుకు ఉందని తన అద్వితీయ కెప్టెన్సీతో నిరూపించిన వ్యక్తి వాడేకర్. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై, వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌పై విజయాలను భారత్ అతని నేతృత్వంలోనే నమోదు చేసింది. కెరీర్‌లో 37 టెస్టులు ఆడిన వాడేకర్ ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2,113 పరుగులు చేశాడు. రెండు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడి 73 పరుగులు సాధించాడు. 237 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 15,380 పరుగులు చేశాడు. భారత క్రికెట్‌పై ఢిల్లీ, ముంబయి మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న రోజుల్లో టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడం ఒక రకంగా వాడేకర్‌ను మానసిక ఒత్తితికి గురి చేసింది. చాలా మంది కీలక ఆటగాళ్లు అతనికి సహకరించలేదు. 1974లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు, లార్డ్స్ మైదానంలో అప్పటి భారత బ్యాట్స్‌మెన్ ఉద్దేశపూర్వకంగానే వికెట్లు పారేసుకున్నారు. ఫలితంగా 42 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా చేసిన అతి తక్కువ స్కోరు ఇదే. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అయితే, సమర్థుడైన కారణంగా అతనిని జట్టు మేనేజర్ పదవి దక్కింది. ఆ పదవిలో అత్యుత్తమ సేవలు అందించాడు. 1988-1999 మధ్యకాలంలో భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, వారిని అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన ఘనత వాడేకర్‌కు దక్కుతుంది.
బీసీసీఐ సంతాపం
వాడేకర్ మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సంతాపం ప్రకటించింది. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వాడేకర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.