క్రీడాభూమి

చెలరేగిన బౌలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 19: గెలుపే లక్ష్యంగా థర్డ్ టెస్ట్‌లో భారత్ శ్రమకోడుస్తోంది. రెండోరోజు టీ విరామం సమయానికి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసిన కోహ్లీసేన, సెకండ్ ఇన్నింగ్స్‌నూ నిలకడగానే ఆడుతోంది. ఆదివారం ఆట ముగించే సమయానికి 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు సాధించి, 292 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ధాటిగా ఆట మొదలు పెట్టిన ఓపెనర్లు శిఖర్ ధావన్ (44-63 బంతుల్లో), కెఎల్ రాహుల్ (36- 33 బంతుల్లో) సాధించారు. ఆట నిలిపివేసే సమయానికి ఛెతేశ్వర్ పూజారా (33-67 బంతుల్లో), విరాట్ కోహ్లీ (8-23 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
తొలుత ప్రమాదంలో పడిన తొలి ఇన్నింగ్స్‌ను కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు భుజానికెత్తుకోవడంతో 329 పరుగులు సాధించిన భారత్, మలి రోజు ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలోనూ అంతే నేర్పు చూపించింది. అటు వాతావరణం, ఇటు పిచ్ కలిసి రావడంతో చెలరేగిపోయిన భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును 161 పరుగుల వద్దే ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా వీరవిహారంతో ఐదు వికెట్లు తీసుకుంటే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు చెరి రెండు వికెట్లు, మహ్మద్ షమి ఒక వికెట్‌తో ఇంగ్లాండ్‌ను పూర్తిగా నియంత్రించారు. జాస్ బట్లర్ (39), అలిస్టర్ కూక్ (29)లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ రెండు పదుల స్కోరు దాటలేదంటే భారత బౌలర్ల సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. మలిరోజు మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోవడంతో, రెండోరోజే భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 168 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, మలి ఇన్నింగ్స్‌నూ ధాటిగానే సాగిస్తోంది.