క్రీడాభూమి

గురి తప్పని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 21: దేశం కోసం ఆసియా క్రీడా వేదికనెక్కిన తరువాత రైతు కొడుకైనా, రౌతు బిడ్డయినా గురి పెట్టాల్సింది లక్ష్యానికే. సాధించాల్సింది పతకానే్న. అదే చేశాడు మీరట్ కుర్రాడు సౌరబ్ చౌదరి. రైతు కుటుంబంలో కష్టాలు సౌర బ్ ఇంట్లోనూ మామూలే అయినా, అవేమీ అతన్ని డిస్ట్రర్బ్ చేయలేదు. లక్ష్యానికి ఒక్కసారి గురిపెట్టాక మిగిలిన వేటినీ నీ కన్ను చూడకూడదన్న కోచ్ మాటలు చెవుల్లో రింగుమంటుంటే... పదహారేళ్ల ఆ పిల్లాడి తూటాలు మాత్రం లక్ష్య ఛేదనవైపు దూసుకుపోయాయి. అతని సంకల్ప నిశ్చయానికి స్వర్ణం తలొంచింది. మెడకు చేరింది. మంగళవారం ఆసియా గేమ్స్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు మీరట్ కుర్ర షూటర్ సౌరబ్ చౌదరి. బరిలో చాంపియన్లు పిస్టల్స్ పట్టుకుని వరుసలో నిలబడినా అతనేమీ చలించలేదు. 2010 ప్రపంచ చాంపియన్, జపాన్ షూటర్ టోమొయుకి మస్టౌడా, మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్, కొరియన్ షూటర్ జిన్ జోంగ్-ఓహ్ తనముందు నిలబడినా సౌరబ్ భయపడలేదు. చివరి రెండు షాట్లలో 10.2, 10.4 పాయింట్లు సాధించి అతిరథుల్లాంటి షూటర్లనే విస్మయానికి గురిచేసిన సౌరబ్ సునాయాసంగా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరో రెండు మూడు నెలల్లో జర్మనీలో జరగనున్న జూనియర్ ప్రపంచ కప్ టోర్నీలో స్వర్ణం సాధించగలనన్న నమ్మకాన్ని దేశానికి అందించాడు. అదే జరిగితే స్టార్ షూటర్లు జస్పాల్ రాణా, రణధీర్ సింగ్, జీతురాయి సరసన సౌరబ్ పేరు చేరడం ఖాయం. ఇదిలావుంటే, మంగళవారం భారత షూటర్లు సంజీవ్ రాజ్‌పుత్, అభిషేక్ వర్మలు సైతం రజత పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఆసియా వేదికపై ఎగురవేశారు.

చిత్రం..స్వర్ణ, రజత పతకాలతో సౌరబ్ చౌదరి, అభిషేక్ వర్మ