క్రీడాభూమి

టెన్నిస్‌లో అంకితకు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబంగ్, ఆగస్టు 23: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి జాంగ్ షూయ్‌తో పోటీ పడిన అంకిత 4-6, 6-7 (6)తో ఓటమితో కాంస్యతో సరిపెట్టుకుంది. 25 ఏళ్ల అంకిత రైనా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో పతకం అందుకున్న రెండో భారత క్రీడాకారిణిగా ఘనత దక్కించుకుంది. 2006లో దోహా, 2010లో గువాంగ్‌హోలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారిణి సానియా మీర్జా కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.
కబడ్డీ ఫైనల్‌కు భారత్ మహిళలు
ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో చైనీ తైపీని 27-14తో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో జరిగిన సెమీఫైనల్స్‌లో క్వాలిఫై అయిన భారత్ ఫైనల్‌లో ఇరాన్ లేదా థాయ్‌లాండ్ జట్టుతో పోటీ పడుతుంది. గతంలో జరిగిన రెండు ఆసియా క్రీడల్లోనూ భారత మహిళా టీమ్ గోల్డ్ మెడల్స్ సాధించింది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో భారత్ మూడుసార్లు ఘన విజయాన్ని నమోదు చేసింది. అయతే, కబడ్డీలో ఇప్పటికే ఏడుసార్లు చాంపియన్‌గా అవతరించిన భారత పురుషుల జట్టు ఆసియా గేమ్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో 18-27 తేడాతో ఇరాన్ చేతిలో పరాజయం పాలైంది.