క్రీడాభూమి

విహాన్..సాధించెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబంగ్, ఆగస్టు 23: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. గురువారం జరిగిన షూటింగ్ విభాగం డబుల్స్ ట్రాప్‌లో మన దేశానికి చెందిన 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ టీనేజర్ విహాన్ డబుల్స్ ట్రాప్‌లో మొత్తం 73 షాట్‌లతో ఈ పతకాన్ని అందుకున్నాడు. 14 ఏళ్ల వయసులో గత ఏడాది జరిగిన షాట్‌గన్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలో శార్దూల్ విహాన్ నాలుగు గోల్డ్ మెడల్స్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్ గోల్డ్‌మెడలిస్టు అయిన తన మాజీ కోచ్ అన్వర్ సుల్తాన్ నేతృత్వంలో విహాన్ షూటింగ్‌లో రాటుదేలాడు. కాగా, ఆసియా క్రీడల్లో కొరియాకు చెందిన ఛిన్ హ్యూన్‌వో 74 షాట్లతో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఖతర్‌కు చెందిన అల్ మేరీ హమద్ అ లీ 53 షాట్లతో కాంస్య పత కం కైవసం చేసుకున్నాడు.
సంచలన టీనేజర్
ఇండోనేషియా ఆసియా క్రీడల్లో గురువారం షూటింగ్ విభాగంలోని డబుల్ ట్రాప్‌లో స్వర్ణం సాధించిన టీనేజర్ శార్దూల్ విహాన్ సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. ఆసియా క్రీడల్లో అతి పిన్న వయసులోనే మెడల్ అందుకున్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. డబుల్ ట్రాప్‌లో విహాన్‌తో పోటీపడిన మరో ఇద్దరు ప్రత్యర్థుల్లో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన 34 ఏళ్ల హ్యుయాన్ ఛిన్ కాగా, మరొకరు ఖతర్‌కు చెందిన 42 ఏళ్ల హమద్ అలీ అల్ మేరీ ఉన్నారు. ప్రత్యర్థులిద్దరూ గోల్డ్‌మెడల్, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. నిజానికి షాట్ గన్ పోటీలు ఎక్కడ జరిగినా సీనియర్లదే పైచేయిగా ఉంటుంది. కానీ గురువారం జరిగిన ఆసియా క్రీడల్లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మోదీపురంలో గల దయావతి మోదీ అకాడమీలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఈ టీనేజ్ సంచలనం విహాన్ షూటింగ్‌లోని డబుల్ ట్రాప్‌లో ఎంతో పరిణితి చెందిన షూటర్ల మాదిరిగా ఆటతీరును కనబరిచి ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడి కాంస్య పతకం కైవసం చేసుకున్న ఖతర్ ఆటగాడు హమద్ అలీ అల్ మేరీ భారత టీనేజర్ కంటే మూడింతలు వయసులో పెద్దవాడు కావడం గమనార్హం. విహాన్ షూటింగ్ పోటీ కోసం గత నాలుగేళ్లుగా చాలా కష్టపడుతున్నాడు. కోచ్ అన్వర్ సుల్తాన్ నేతృత్వంలో షూటింగ్‌లో రాటుదేలాడు. శిక్షణ సమయంలో విహాన్ చూపించిన శ్రద్ధాశక్తులు గమనించిన తాను అతను తప్పకుండా ఆసియా క్రీడల్లో పతకం సాధిస్తాడనే గట్టి నమ్మకం తనకు ఉందని కోచ్ అన్నాడు. విహాన్ అంకుల్ మనోజ్ విహాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ తెల్లవారుజామన ఐదు గంటలకే నిద్రలేచి మీరట్ నుండి ఢిల్లీ (రాణే) లోని కర్నీ షూటింగ్ శిక్షణ శిబిరానికి వెళ్లి, తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరేవాడని అన్నాడు. 15 ఏళ్ల పిల్లాడు ఎవరైనా అంతలా కష్టపడతాడని తాను అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నాడు. విహాన్ కుటుంబ సభ్యులు వ్యాపారం చేస్తుంటారు. విహాన్‌కు మొదటినుంచి క్రికెట్, ఆ తర్వాత బాడ్మింటన్ వైపు మొగ్గుచూపినా చివరకు షూటింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అందులోనే ఆరితేరాడు. ఈ సందర్భంగా విహాన్ మాట్లాడుతూ 2014లో జరిగిన నార్త్ జోన్ మీట్‌లో తాను పతకం సాధించానని, దీంతో షూటింగ్‌పై మరింత నమ్మకం కలిగిందని అన్నాడు. 2017లో జర్మనీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో నాలుగు టైటిళ్లు అందుకోవడంతో ఈ దిశగా మరిన్ని పతకాలు అందుకోవాలని కలలుగన్నానని పేర్కొన్నాడు. విహాన్ సాధించిన రజత పతకంతో భారత్ ఖాతాలో గురువారం నాటికి ఎనిమిది పతకాలు జమ అయ్యాయి.
కాగా, ఈనెల 21న జరిగిన 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌లోని మీటర్‌కు చెందిన 16 ఏళ్ల సౌరభ్ చౌదరి గోల్డ్ మెడల్ అందుకున్న టీనేజర్‌గా ఘనత వహించాడు. మన దేశానికి చెందిన టీనేజర్లలో 15 ఏళ్ల అనీష్ భన్వాలా, 16 ఏళ్ల మనూ బాకర్ ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌తో గోల్డ్ మెడల్స్ అందుకున్న విషయం తెలిసిందే.
ఖాడే, నటరాజ్ జాతీయ రికార్డులు
విర్ధావన్ ఖాడే, శ్రీహరి నటరాజ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా క్రీడల్లో ముందంజ వేశారు. ఈ క్రమంలో వారు కొత్త జాతీయ రికార్డులను నెలకొల్పారు. పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో ఖాడే 24.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, తొమ్మిదేళ్ల క్రితం ఫొషాన్ (చైనా)లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో 24.14 సెకన్లతో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు. కాగా, నటరాజ్ పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో 2:02.92 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. గత ఏడాది కామనె్వల్త్ గేమ్స్‌లో 2:04.75 నిమిషాలతో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు చేశారు. కాగా, వీరిద్దరూ తమతమ విభాగంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు.
జిమ్నాస్టులు విఫలం
భారత జిమ్నాస్టులు దారుణంగా విఫలమయ్యారు. అరుణ బుద్ధా రెడ్డి, ప్రణతి నాయక్ హీట్స్‌లోనే రాణించలేకపోయారు. పోటీదారులందరిలోకి అట్టడుగు స్థానంలో నిలిచి, ఫైనల్స్‌కు అర్హత సంపాదించలేకపోయారు.
సింధు, సైనా శుభారంభం
బాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బాడ్మింటన్ ఈవెంట్‌లో శుభారంభం చేశారు. తమతమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఇద్దరూ విజయాలను నమోదు చేసి, రెండో రౌండ్ చేరారు. సింధు 21-10, 12-21, 23-21 తేడాతో ఊ థి ట్రాంగ్ (వియత్నాం)పై గెలుపొందింది. సింధు రెండు, మూడు సెట్లలో తీవ్రమైన పోటీని ఎదుర్కొని, అతి కష్టం మీద గెలిచింది. అయితే, సైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇరాన్ క్రీడాకారిణి సొరయా అఘాజియాగాను 21-7, 21-9 తేడాతో చిత్తుచేసి, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.