క్రీడాభూమి

రోయింగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్, ఆగస్టు 24: 18వ ఆసియా గేమ్స్‌లో భారత రోవర్లు చారిత్రక విజయాలు నమోదు చేశారు. రోయింగ్ రేస్ చివరి రోజు పురుషుల క్వాడ్రుపుల్ స్కల్స్‌లో స్వర్ణం సాధిస్తే, లైట్‌వెయిట్ స్కల్స్ పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుని భారత ఆర్మీ పట్టు ఎంత బలమైనదో ప్రపంచానికి చాటిచెప్పారు. ‘రేపన్నది లేదు. పతకం లేకుండా జకబారింగ్ సరస్సు నుంచి బోట్లు వెనక్కి తిప్పేది లేదు’ అని భీషణ ప్రతిజ్ఞ చేసిన రోవర్లు అవరోధాలను అధిగమించారు. అనూహ్యంగా మూడు పతకాలు భారత్ ఖాతాలో వేయగలిగారు. ‘గురువారం మాకు చెడ్డరోజు. పరిస్థితులు అనుకూలించ లేదు. అయినా మన రోవర్లు (సైనికులు) కలత చెందలేదు. నా జట్టు సభ్యులకు ఒకటే చెప్పాను. మనికిక రేపన్నది లేదు. స్వర్ణం కోసమే మన పోరాటం. అది భారత ప్రజలకు చెందాలి. చావో రేవో తేల్చుకుందామన్నా. అదే చేసి చూపించాం’ అని క్వాడ్రుపుల్ స్కల్స్ జట్టు సీనియర్ సావర్ణ సింగ్ ఆనందంగా వివరించాడు. సావర్ణ మాటలు జట్టు సభ్యులైన దత్తు బాబన్ బోకనల్, సుఖ్‌మీత్ సింగ్, ఓం ప్రకాష్‌లోనూ ప్రతీకారాన్ని రగిలించాయి. గురువారం ఈవెంట్‌లో దాదాపుగా వెనకపడిన జట్టు, 24 గంటలు తిరక్కుండానే స్వర్ణాన్ని సాధించి శెహబాష్ అనిపించుకుంది. ఈ రేస్‌లో ఆతిథ్య దేశం ఇండోనేసియా, థాయిలాండ్‌కు రెండు, మూడు స్థానాలు దక్కాయి. ఇక లైట్‌వెయిట్ సింగిల్ స్కల్స్‌లో దుష్యంత్ చౌహాన్ థర్డ్ ప్లేస్‌తో కాంస్యం సాధిస్తే, పురుషుల డబుల్స్ లైట్‌వెయిట్ స్కల్స్‌లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్ కాంస్యం సాధించారు. ఓ ట్రక్కు డ్రైవర్ కొడుకైన భగవాన్ సింగ్ జర్నలిజం కెరియర్‌ను వదిలేసి ఇండియన్ ఆర్మీలో చేరాడు. దుష్యంత్ ఇండియన్ ఆర్మీలో అనుభవమున్న రోవర్. 500 మీటర్ల ఈవెంట్ పూరె్తైన వెంటనే అలసిపోయిన దుష్యంత్‌ను మెడికల్ సెంటర్‌కు తరలించారు. మెడల్ సెర్మనీ సమయంలో అతను సరిగ్గా నిలబడలేకపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘నా జీవితంలో ఇదే చివరి రేస్ అనుకున్నా. అదొక్కటే నా మైండ్‌లో బలంగా నాటుకుపోయింది. ఆ కారణంగానే శక్తికి మించి బోటును తోసినట్టున్నా. రేస్ టైంలో జలుపు, గొంతునొప్పితో బాధపడుతున్నా. ఇవే నాపై ఒకింత ప్రభావం చూపించి ఉంటాయి’ అని దుష్యంత్ వ్యాఖ్యానించాడు. చిత్రం ఏమిటంటే పురుషుల క్వాడ్రుపుల్ స్కల్స్ టీం ఈవెంట్ రోవర్లు నలుగురూ అనారోగ్య పరిస్థితులనే ఎదుర్కొంటూ స్వర్ణాన్ని సాధించడం.

చిత్రం.. స్వర్ణం సాధించిన భారత రోవర్లు