క్రీడాభూమి

అంచనాకు అందలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తై జు వేగం అనూహ్యం. ఆమె ఆటను కనీసం అంచనా వేయలేకపోయాను. ఆమెతో ఆడాలంటే వేగం, సున్నితమైన కదలికల్లో మరింత రాటుదేలాలి. ఆమె సంపూర్ణమైన ప్లేయర్. ఆమె కొట్టిన షాట్స్, విసిరే ర్యాలీలు.. అన్నీ వైవిధ్యం అనిపించాయి. ఏ ప్లేయర్‌కైనా ఓ స్టయిలుంటుంది. కానీ, తై జు ఆట తీరే వేరు. ఆమెను అంచనా వేసేసరికే మ్యాచ్ ముగించింది. వైవిధ్యమైన ఆ నైపుణ్యమే తై జు విజయానికి కారణమై ఉండొచ్చు. నిజానికి నేను బాగా ఆడాను. ఆమె చాలా బాగా ఆడింది. అదే నా పరాజయానికి కారణం. తై జుతో చాలా మ్యాచ్‌లే ఆడినా, ఎప్పుడూ ఆమెదే పైచేయి అవుతుంది. ఆమెను ఎదుర్కోవాలంటే చాలా సన్నద్ధత, సంసిద్ధత కావాలి. ఏదోక రోజున ఆమెపై విజయం సొంతం చేసుకుంటాననే అనుకుంటున్నా.