క్రీడాభూమి

తక్కువేమి మనకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, సెప్టెంబర్ 2: ఉపఖండం క్రీడాసంరంభంలో భారత ఆకాంక్ష నెరవేరిందనడానికి కేవలం స్వర్ణాల సంఖ్యే ప్రామాణికం కాకపోవచ్చు. దశాబ్దాలుగా అసాధ్యమనుకున్న క్రీడాంశాల్లో ‘స్వర్ణ్భేరి’ మోగించిన అథ్లెట్ల ధీరోదాత్తత మాత్రం కచ్చితంగా భవిష్యత్ క్రీడాతరాలకు కొత్త ఊపిరే. కామనె్వల్త్‌కంటే ఆసియా క్రీడాసంరంభంలో భారత్ మరో మెట్టెక్కిందని చెప్పడానికి పట్టికలో పదిలమైన స్థానం చాలు. భిన్న క్రీడాంశాల్లో చరిత్ర సృష్టించి, మునె్నన్నడూ ఎరుగని అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారుల సత్తా వచ్చే ఒలింపిక్‌పై ఆశలు రెకెత్తిస్తున్నాయనీ చెప్పొచ్చు. జకార్తా, పాలెంబాగ్ నుంచి విజయ దరహాసంగా స్వదేశానికి చేరుతున్న క్రీడాకారులను చూస్తుంటే.. క్రికెట్ మైకం నుంచి తేరుకుని కొత్త క్రీడాంశాలపై యువతరం దృష్టిసారించ గలదన్న నమ్మకాలనూ కాదనలేం. భారత సత్తాను ఉపఖండానికి రుచి చూపిస్తాయనుకున్న హాకీ, కబడ్డీ జట్లు విఫలమైతేనేం, ఇటు టీనేజర్ సౌరభ్ చౌదరి, అటు 60ఏళ్ల వృద్ధుడు ప్రణబ్ బర్దన్... ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. కనికట్టు క్రీడా విన్యాసంతో ఉపఖండాన్ని ఆకట్టుకున్నారు. అందుకే నాలుగేళ్ల క్రితం ఇంచియాన్‌లో భారత్ సాధించిన పతకాలు 65 అయితే, ఆసియాన్‌లో సాధించిన పతకాలు 69కి చేరాయి. 1951లో ఆసియా క్రీడారంభానికి ఆతిథ్యమిచ్చిన భారత్ 15 స్వర్ణాలు సాధిస్తే, 18వ ఆసియా క్రీడల్లో 15 స్వర్ణాలు సాధించి సమం చేయడం విడ్డూరం కాకపోవచ్చు. కానీ, మునె్నన్నడూ దక్కనన్ని రజత (24) పతకాలను కైవసం చేసుకోవడం వల్లే పతకాల పట్టికలో భారత్‌కు 8వ స్థానం దక్కిందన్నది మాత్రం కాదనలేని నిజం. సమ్మిళిత క్రీడా సంరంభంలో ప్రతీ దేశానికీ ఆటుపోట్లు తప్పవు. భారత్ సైతం అందుకు అతీతం కాదు. బరిలోకి దిగాక ఆ క్షణంలో అథ్లెట్లు ప్రదర్శించే ప్రతాపమే ఫలితాలకు గీటురాయి అవుతుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌ను పక్కనపెడితే, సాధించిన పదిహేను స్వర్ణాల్లో ఏడు స్వర్ణాలు గెలొరా బంగ్ కర్నో స్టేడియంలో సాధించినవే. ఇనుప గుండును 20.75 మీటర్లు విసిరి (షాట్ పుట్) తేజిందర్ పాల్ సింగ్ తూర్ మొదటి స్వర్ణాన్ని అందిస్తే, ఏడు క్రీడాంశాల్లో ఏకబిగిన సత్తాచాటుకుని హెప్ట్థ్లాన్‌లో స్వప్న బర్మన్ స్వర్ణం సాధించడం భారత సత్తాకు పెద్ద ప్రతీక. అవరోధాలను అధిగమించి ట్రాక్‌కు తిరిగొచ్చిన పరుగుల సునామీ ధుతీచంద్, రేపటి ఖేల్ ఇండియా వేగాన్ని రుచిచూపిస్తూ రెండు రజతాలు ఒడిసిపట్టింది. 100 మీటర్ల పరుగులో 20 ఏళ్ల భారత్ కలను సాకారం చేసి ధుతీ కొత్త చరిత్ర సృష్టించింది. ఆఫ్రికా సంతతికి చెందిన ఖతార్, బహ్రెయిన్ అథ్లెట్లు ట్రాక్‌మీదుంటే పతకాల సాధన కష్టమన్న అపనమ్మకాన్ని తుడిచేస్తూ, 200 మీటర్ల పరుగులో హిమదాస్ రజతాన్ని కైవసం చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 800 మీటర్ల పరుగులో మన్జీత్ సింగ్ స్వర్ణాలు అందుకుంటే, టేబుల్ టెన్నిస్‌లో మనీకా బాత్రా, శరత్ కమల్, జి సతియన్, హర్మీత్ దేశాయ్‌లు కాంస్యాలు సాధించడం చెప్పుకోదగ్గ విజయాలు. 16ఏళ్ల సౌరభ్ చౌదరి, పదిహేనేళ్ల శార్దూల్ విహాన్ షూటింగ్‌లో పతకాలు సాధించి, భారత క్రీడా సత్తాకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. సంప్రదాయ క్రీడ కుస్తీలో సుశీల్ కుమార్, సాక్షి మాలిక్‌లు విఫలమైనా, భారత సత్తా మసకబారకుండా భజరంగ్ పునియా, వినీష్ ఫొగట్‌లు స్వర్ణాలు సాధించి శెహ్‌బాష్ అనిపించుకున్నారు. బ్రిడ్జి గేమ్‌లో వృద్ధులు బర్దన్, శిబినాథ్‌లు స్వర్ణం సాధించి ‘ఇది గేబ్లింగ్ కాదు, మేథో క్రీడ’ అని కొత్త నిర్వచనమిచ్చారు. బాక్సింగ్ ఎరినాలోన భారత్ తిరుగులేని ఆధిపత్యానే్న ప్రదర్శించింది. పాతికేళ్ల ఆర్మీ కుర్రాడు అమిత్ ఫంగల్ రక్తమోడుతూనే స్వర్ణాన్ని సాధించడం ఒలింపిక్‌కు వచ్చే దేశాలకు భారత్ చేసిన ముందస్తు హెచ్చరిక అనుకోవాలి. అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్చర్లు స్వర్ణం సాధించకున్నా, వట్టి చేతులతో వెళ్లే సంప్రదాయం తమకు లేదంటూ పతకాలు పట్టుకొచ్చారు. హాకీ, కబడ్డీల్లో తిరుగులేని భారత జట్లు సఫలమైవుంటే, భారత స్వర్ణాల సంఖ్య తిరుగులేనిదే అయివుండేది. పూల్ గేమ్స్‌లో చెలరేగిన పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో ఓటమి భారత్‌కు తీరని నష్టమే. మొత్తంగా కొన్ని అసంతృప్తులు ఉన్నా, కొన్ని జాతీయ రికార్డులను బద్దలుకొడుతూ ఆసియా క్రీడాసంరంభంలో భారత్ ప్రదర్శించిన క్రీడా సత్తా భవిష్యత్ వెలుగులకు సంకేతమే.