క్రీడాభూమి

ఇంగ్లాండ్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంఫ్టన్: సౌతాంఫ్టన్ సాక్షిగా టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ వశమైంది. 60 పరుగుల ఆధిక్యంతో నాల్గవ టెస్ట్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లాండ్, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సాధించింది. మలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 లక్ష్యాన్ని అధిగమించడంలో టీమిండియా పూర్తిగా విఫలమై, 184 పరుగులకే ఆలౌటైంది. ఇన్నింగ్స్‌ను నిలబెట్టుకునేందుకు కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రెహనేలు సాధించిన అర్థ శతకాల ప్రయత్నం ఫలించలేదు. చివరి ఓవర్లలో పరుగులు సాధించేందుకు అశ్విన్ చేసిన ప్రయత్నాన్నీ శామ్‌కుర్రన్ అడ్డుకోవడంతో టీమిండియాకు చేదు అనుభవం తప్పలేదు. నాలుగు వికెట్లు తీసిన మొయిన్ అలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకుంటే, ఆండర్సన్, స్టోక్స్ చెరి రెండు వికెట్లు, కుర్రన్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్, లండన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు కోల్పోయిన టీమిండియా, నాటింగ్‌హామ్‌లో 3వ టెస్ట్‌లో విజయం సాధించింది. నాల్గవ టెస్ట్‌లో విఫలమవ్వడంతో, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ‘ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. అందులో సందేహం లేదు. తప్పొప్పులను సమీక్షించడం కంటే ఓటమిని అంగీకరించాలి’ అని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘టీమిండియా నిస్సందేహంగా గొప్ప జట్టు. వాళ్ల నిజాయితీయే వాళ్ల బలం. ఈరోజు ఇంగ్లీష్ జట్టు బాగా ఆడిందన్నది వాస్తవం’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వ్యాఖ్యానించాడు.