క్రీడాభూమి

ఐదో టెస్ట్‌కు అదే జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 4: సొంతగడ్డపై భారత్‌తో ఇంగ్లాండ్ ఆడబోయే చివరి టెస్ట్‌కు ఎలాంటి మార్పులులేని జట్టును ఈసీబీ ప్రకటించింది. శుక్రవారం ఒవల్‌లో సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్ జరగనుంది. నిజానికి సిరీస్‌లో 3-1 స్కోరుతోవున్న ఇంగ్లాండ్‌కు చివరి టెస్ట్ లాంచనప్రాయమే. భారత్‌తో సీరీస్‌లో చివరి టెస్టే, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న అత్యధిక పరుగుల వీరుడు అలిస్టర్ కుక్‌కు ఫేర్‌వెల్ గేమ్ కానుంది. జానీ బెయిర్ స్టోను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేర్కొంటూ జట్టు వివరాలను బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ మంగళవారం వెల్లడించాడు. ప్రస్తుతం క్లెమ్స్‌ఫోర్డ్‌లో ఎసెక్స్‌తో జరుగుతోన్న కౌంటీ మ్యాచ్‌లు ఆడుతున్న ఒల్లివర్ పోప్ గురువారం జట్టుతో కలుస్తాడు. అద్వితీయ ఫాంతో నాల్గవ టెస్ట్‌ను గెలుచుకున్న కెప్టెన్ జో రూట్ సారథ్యంలోని ఆటగాళ్లు అలిస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, జానీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్, ఓలివర్ పోప్, మొరుూన్ అలి, ఆదిల్ రషీద్, శామ్‌కుర్రన్, జేమ్స్ ఆండర్సన్, స్టార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్‌లే ఐదో టెస్ట్‌ను ఆడతారు.