క్రీడాభూమి

1500 మీటర్లపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించిన పరుగుల వీరుడు, కాలికట్‌కు చెందిన జిన్సన్ జాన్సన్ ఇపుడు టోక్యో ఒలింపిక్స్‌పై దృష్టి సారించాడు. 2020లో జరిగే ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల పరుగు పందెంలో మరో రికార్డు సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో జాన్సన్ 3.44 నిమిషాల 72 సెకన్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇపుడు ఒలింపిక్స్‌పై దృష్టి సారించడం వల్ల 800 మీటర్ల కంటే 1500 మీటర్ల విభాగంలో తప్పకుండా మెడల్ సాధిస్తాననే గట్టి నమ్మకం ఉందని అన్నాడు. భారత ఆర్మీ నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమం సందర్భంగా జాన్సన్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడాడు.