క్రీడాభూమి

‘ఈక్వెస్ట్రియన్‌కు నిధులివ్వండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 6: దేశంలో ఈక్వెస్ట్రియన్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా నిధులు కేటాయించాలని ఆసియా గేమ్స్ విజేత ఫౌదా మీర్జా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఫౌదా మీర్జా రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల్లో ఈ క్రీడను 1982లో ప్రవేశపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు భారత క్రీడాకారులెవరూ ఈ ఘనత సాధించలేదు. ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన ఫౌదా మీర్జా వ్యక్తిగత జంపింగ్‌లో 26.40 స్కోరుతో రెండోస్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. యూకే, జర్మనీ, జపాన్, థాయిలాండ్ వంటి దేశాల్లో ఈక్వెస్ట్రియన్ క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, మన దేశంలో కూడా ఈ క్రీడను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తే ఎంతోమంది అథ్లెట్లు ముందుకు వస్తారని అభిప్రాయపడింది.