క్రీడాభూమి

పొరపాట్లు పునరావృతం కానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 6: ‘శాఫ్’ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై 2-0తో విజయం సాధించినందుకు తృప్తిగా ఉన్నా గత మ్యాచ్‌లో జరిగిన కొన్ని పొరపాట్లు మాల్దీవ్‌లతో జరిగే మ్యాచ్ కంటే ముందుగానే మళ్లీ పునరావృతం కాకుండా జాగురూకతతో వ్యవహరిస్తామని భారత ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ తెలిపాడు. పొరపాట్లు దొర్లకుండా చూడడం ద్వారా రానున్న మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరును కనబరుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ జట్టు ప్రదర్శన తీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ గెలుపునకు మరికొన్ని గోల్స్ చేయాల్సి ఉందని అన్నాడు. అండర్-23 టీమ్ అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించడంతో సీనియర్ ఆటగాళ్లపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు యువ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు. కాగా, ఆదివారం జరిగే ఫైనల్ గ్రూప్ స్టేజి మ్యాచ్‌లో భారత్ టీమ్ మాల్దీవ్ జట్టుతో తలపడుతుంది.