క్రీడాభూమి

స్వర్ణాన్ని ముద్దాడిన సౌరభ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగవన్ (దక్షిణ కొరియా): భారత టీనేజ్ సంచలనం సౌరభ్ చౌదరి (16) మరో గోల్డ్ మెడల్‌ను ముద్దాడాడు. ఇక్కడ గురువారం జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఈ మెడల్ సాధించాడు. ఇండోనేషియాలోని జకార్తాలో ఇటీవల నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో 10 మీటర్ల జూనియర్ విభాగంలో 245.5 పాయింట్లతో గోల్డ్‌మెడల్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ అర్జున్ సింగ్ ఛీమా కాంస్య పతకం అందుకున్నాడు. కాగా, పురుషుల సీనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ అభిషేక్ వర్మ నిరాశపరచి, కేవలం రజతంతోనే సరిపెట్టుకున్నాడు. అయితే, అభిషేక్ వర్మ 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పాల్గొనేందుకు అర్హత సాధించలేకపోయాడు. గత ఆసియా క్రీడల్లో వర్మ 583 పాయింట్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.