క్రీడాభూమి

జూనియర్ల ధనాధన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్వాన్ (ద.కొరియా) సెప్టెంబర్ 7: భారత్ అలుపెరుగని పసిడి పరుగు సాగిస్తోంది. జూనియర్ షూటర్ల గురితప్పని పాటవం స్వర్ణకాంతులు వెదజల్లుతోంది. ద.కొరియా వేదికగా సాగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్ టోర్నీలో శుక్రవారం కుర్ర షూటర్లు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో హృదయ్ హజారికా స్వర్ణాన్ని సాధిస్తే, అంతకుముందు భారత మహిళా జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసి పసిడి పతకాన్ని అందుకుంది. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో చైనా షూటర్ షి మెంగ్యావో (250.5 పాయింట్లు)తో హోరాహోరీ పోరాడిన భారత షూటర్ ఎలావెనిల్ వలారివన్ (249.8 పాయింట్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. పదిహేడేళ్ల షూటర్ శ్రేయా అగర్వాల్ (228.4 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. టోర్నమెంట్ 52వ ఎడిషన్ ఆరో రోజు పూర్తయ్యేసరికి భారత్ 18 పతకాలు సాధించి, ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో సత్తా చాటుకుంది. క్రొయేషియాలని జెగ్రెబ్‌లో జరిగిన టోర్నీ 49వ ఎడిషన్‌లో అత్యధిక ప్రదర్శనతో ఆరు పతకాలు సాధించిన భారత్, ఇప్పుడు 18 పతకాలకు చేరింది. పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇరాన్ షూటర్ అమీర్ నెకౌనమ్‌పై తొలుత ఆధిక్యత కనబర్చిన హాజారికా, 24 షాట్స్ పూర్తయ్యే సరికి 250.1 పాయింట్ల స్కోరుతో సమమయ్యాడు. అయతే షూట్-ఆఫ్‌లో అత్యద్భుత ప్రదర్శనతో పసిడిని కైవసం చేసుకుంటే, ఇరాన్ షూటర్ అమీర్ రజతానికి, రష్యా షూటర్ గ్రిగోరి షమకోవ్ కాంస్యానికి పరిమితమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీం ఈవెంట్‌లో భారత షూటర్లు ఎలావెనిల్ (631 పాయింట్లు), శ్రేయా అగర్వాల్ (628.5), మానిని కౌశిక్ (621.2)లు అద్భుత ప్రదర్శనతో స్వర్ణాన్ని చేక్కించుకున్నారు. ఎలావెనిల్ అత్యధిక స్కోరు సాధించి జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణాన్ని సాధించడమే కాదు, ప్రపంచ రికార్డు నమోదు చేసింది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్లు ఏఒక్కరు ఫైనల్‌కు చేరలేకపోయారు. ఆసియా గేమ్స్ రజత పతక విజేత సంజీవ్ రాజ్‌పుట్ 58వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. స్వాప్నిల్ కుసలె 55వ స్థానం, అనిల్ షెరాన్ 44వ స్థానానికి పరిమితమయ్యారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అత్యధ్భుత ప్రదర్శనతో అర్హతా రౌండ్‌ను అధిగమించిది. ఆసియా గేమ్స్ చాంపియన్ రాహి సర్నోబాట్ 27వ స్థానంలోవుంటే, ఆసియా రజత పతక విజేత హీనా సిధు 61వ స్థానంలో నిలిచింది.