క్రీడాభూమి

కసరత్తు లేకుంటే.. విదేశీ టూర్లు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 8: సరైన కసరత్తు, బలమైన ప్రత్యర్థి లేకుండా విదేశీ పర్యాటక మ్యాచ్‌లకు వెళ్లడం వృధాప్రయాసేనని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. పర్యాటక టెస్ట్ మ్యాచ్‌లకు ముందు ప్రిపరేషన్స్ ఎంతముఖ్యం? అన్న ప్రశ్నకు కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమవడం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. విదేశీ టూర్లకు వెళ్లేముందు టీమిండియా ఎందుకు సరిపడినన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదంటూ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సహ పలువురు సీనియర్లు లేవనెత్తిన ప్రశ్నలపై ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ సమాధానమిచ్చాడు. ‘టీమిండియా పర్యాటక మ్యాచ్‌ల గురించి చాలామందే మాట్లాడుతున్నారు. కానీ, పర్యాటక దేశాలు, అక్కడికి వెళ్తోన్న జట్టు బౌలింగ్ సామర్థ్యం గురించీ మాట్లాడుకోవడం ముఖ్యం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘టూర్‌కు వెళ్లేముందు సరిపడా కసరత్తు లేకుంటే, ఆ టూర్‌లో ఎలాంటి ప్రయోజనాలూ సాధించలేం’ అన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఎక్కడ తప్పులు చేసిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తొలి టెస్ట్ (ఎడ్జ్‌బాస్టన్) మలి ఇన్నింగ్స్‌లో, నాల్గవ టెస్ట్ (సౌతాంఫ్టన్) తొలి ఇన్నింగ్స్‌లో’ అన్నాడు. ‘ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేనేమీ ఆలోచించడం లేదు. కానీ, ఆ రెండు సమయాల్లో సారథిగా నేను గట్టిగా నిలబడి జట్టు విజయం కోసం మరింత కృషి జరిపి ఉండాల్సింది’ అన్నాడు. ‘ట్రెంట్ బ్రిడ్జిలో బాగా ఆడాం. బర్మింగ్‌హామ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్, సౌతాంఫ్టన్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ గురించే ఆలోచిస్తున్నా. మళ్లీ ఒకసారి అదే పొజిషన్‌లో నేనుంటే, జట్టును ఓడిపోనివ్వను అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించాడు. సారథిగా వైఫల్యాలను తానే అంగీకరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నా పొరబాట్లు ఎక్కడున్నాయోనన్న వాటిపైనే దృష్టి పెడతాను. వాటిని అధిగమించి జట్టును ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచిస్తా. గెలుపును అంగీకరించినట్టే పొరబాట్లనూ అంగీకరించేందుకు వెనుకాడను’ అన్నాడు. టెస్ట్ సిరీస్ చేజారడం బాధించిందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇదొక పోటీ. ప్రయత్నం ఫలించలేదు. పోటీలో నెగ్గాలంటే ఎక్కడెక్కడ విఫలమయ్యామో ఆ పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అనూహ్య పరిణామాలను అధిగమించి పోటీలో నిలబడగలిగే మన సామర్థ్యమేమిటో మనకు అప్పుడే తెలుస్తుంది. ఈ కృషి సాగితే ఫరవాలేదు. గెలుపు కోసం ఎలాంటి కఠిన ప్రయత్నం చేయకపోతే మాత్రం, కచ్చితంగా బాధిస్తుంది’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సరైన ప్రయత్నంలో సమష్టిగా నిలబడినపుడే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే శక్తి సమకూరుతుందని, అప్పుడే ప్రత్యర్థికంటే బలమైన జట్టుగా నిలవగలుగుతామని కోహ్లీ వివరించాడు. విదేశీ టూర్‌లో వేడుకలు చేసుకోవడంపై ప్రశ్నించినపుడు ‘అలాంటి వాళ్ల అభిప్రాయాలు పట్టించుకోను. ఆనందకరమైన జీవితంపైనే నా ఫోకస్ ఉంటుంది. నేను హ్యాపీగా ఉండి, నిర్వర్తించాల్సిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఎక్కువ కాలం మనగలుగుతాను. అదే సరైన జీవితం అన్నది నా అభిప్రాయం’ అన్నాడు. సరైన జీవితం సాగించగలిగితేనే క్షేత్రంలో బలమైన ఆటగాడిగా నిలుస్తానన్నాడు. ‘ఎవరి మెప్పుకోసమో నేను క్రికెట్ ఆడటం లేదు. నా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలన్న తాపత్రయం కూడా లేదు. జట్టు గెలుపు కోసమే నా తపన. అనుక్షణం ఆ ఆలోచనతోనే మైదానంలో ఉంటా’ అని కోహ్లీ జవాబిచ్చాడు.