క్రీడాభూమి

టార్గెట్ ఒలింపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 10: ఆసియా గేమ్స్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అద్వితీయ ప్రతిభ కనబర్చి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన రాహి సర్నోబాత్... ఈసారి చరిత్రను తిరగరాసేందుకు తర్ఫీదు పొందుతోంది. టోక్యో 2020 ఒలింపిక్‌లో స్వర్ణాన్ని సాధించడం ద్వారా చరిత్రను తిరగరాయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. 27ఏళ్ల ఈ షార్ప్ షూటర్ ఆసియా గేమ్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా రికార్డుకెక్కడం తెలిసిందే. ‘ఇక సాధించాల్సింది ఒక్క ఒలింపిక్ స్వర్ణమే. నా తదుపరి లక్ష్యం 2020 ఒలింపిక్స్’ అని సర్నోబాత్ పీటీఐ వద్ద వ్యాఖ్యానించింది. ‘ఇప్పటికే ఒకసారి ఒలింపిక్‌కు వెళ్లాను. అది గతం. ఈసారి గురి తప్పను. పోడియం ఫినిషర్‌గా నిలుస్తా’ అని రాహి ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ భారత మహిళా షూటర్లు ఎవరూ ఒలింపిక్‌లో పతకం సాధించలేదు. తన ఒలింపిక్ కల సాకారం చేసుకోవడానికి మానసిక, శారీరక శిక్షణపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పింది. ‘నన్ను నేను మెరుగుపర్చుకోడానికి చాలా కృషి చేయాల్సి ఉంది. ఒలింపిక్స్ అంత ఈజీ కాదు. అక్కడ వత్తిడిని తట్టుకోవాలంటే శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉండగలగాలి. ప్రస్తుతం భారత షూటర్లు సాంకేతికంగా మంచి ఫాంలో ఉన్నారు. సో, ఇప్పుడు మానసిక, శారీరక సామర్థ్యంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది’ అని రాహి వెల్లడించింది. ‘ఒలింపిక్ సుదూరమైన పెద్ద కల. నెరవేరాలంటే ఐదు అర్హతా రౌండ్లు ఎదుర్కోవాలి. అన్నీ ముఖ్యమే. అర్హత సాధించే కసితోనే షూటర్లంతా వస్తారు. సో, పోటీ చాలా కష్టంగా ఉండొచ్చు’ అని విశే్లషించింది.