క్రీడాభూమి

మిథాలి జట్టు బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలె: ఆతిథ్య శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టిన భారత మహిళా జట్టు తొలి వనే్డలో ఘన విజయం సాధించింది. 96 పరుగుల వద్దే లంక జట్టును కుప్పకూల్చిన మిథాలి జట్టు, ఒక్క వికెట్ నష్టంతోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కోరుకున్న లంక జట్టు భారత బౌలర్ల అటాకింగ్ ముందు నిలవలేకపోయింది. మన్సి జోషి, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌ల బౌలింగ్ థాటికి విలవిల్లాడిన లంక క్రీడాకారిణిలు 96 పరుగుల వద్ద 35 ఓవర్లకే కుప్పకూలిపోయారు. ఓపెనర్ జయంగణి 33 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోరు సాధిస్తే, 8మంది క్రీడాకారిణిలు సింగిల్ డిజిట్ స్కోరుతో పెవిలియన్‌కు చేరారు. 8 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకున్న లంక జట్టు, తేరుకోకముందే ఆలౌటైంది. మూడు వికెట్లతో జోషి లంక పతనాన్ని శాసిస్తే, గోస్వామి (2), పూనమ్ (2), దీప్తి గైక్వాడ్, హేమలత చెరో వికెట్‌తో పూర్తిగా సహకరించారు. 99 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లే విజయాన్ని అందించారు. 76 బంతుల్లో 73 పరుగులు సాధించి ఓపెనర్ స్మృతి మంథాన నాటౌట్‌గా జట్టుకు గెలుపును అందించింది. భారత్ స్కోరు 96 పరుగుల వద్ద రణవీరా బౌలింగ్‌లో ఓపెనర్ పూనమ్ రౌత్ (24) సురంగికకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. కేవలం ఒక్క వికెట్ నష్టంతో 19.1 ఓవర్లకే భారత్ విజయాన్ని ఖాయం చేసుకోవడం గమనార్హం. ఈ విజయంతో భారత్ 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. సిరీస్‌లో భాగంగా రెండు జట్లు రెండో వనే్డను గురువారం ఆడనున్నాయి.