క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్‌కు మను, సుమీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 12: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత షట్లర్లు మను అత్రి, బి సుమీత్ రెడ్డి సంచలన విజయం సాధించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మలేసియాకు చెందిన ఒలింపిక్ రజత పతక విజేతలు గోహ్ వి షెమ్, టాన్ వీ కియోంగ్‌లను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. 54 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో 15-21, 23-21, 21-19 స్కోరుతో భారత్ షట్లర్లు మను, సుమీత్‌లు విజయం కైవసం చేసుకున్నారు. ‘ఇటీవలి కాలంలో మా జోడీ బాగా ఆడుతోంది. 2, 3 సెట్లలో ఇద్దరి మధ్యా సమన్వయం సంతృప్తికరం. ముగింపు ఎలా ఉండబోతుందో ముందే ఊహించాం కనుక, కామ్‌గానే ఆడుతూ వచ్చాం’ అని మను వ్యాఖ్యానించాడు.