క్రీడాభూమి

హాకీకి నిజమైన రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ‘ఆటకు అతనే నిజమైన రాయబారి’ అంటూ సర్దార్ సింగ్‌ను భారత హాకీ (హెచ్‌ఐ) వేనోళ్ల పొగిడింది. పనె్నండేళ్లు కెరీర్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ హాకీనుంచి రిటైరవుతున్నట్టు సర్దార్ సింగ్ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్‌కు జాతీయ ప్రాబబుల్స్ క్యాంప్‌నుంచి సర్దార్ వైదొలిగాడు. ‘్భరత హాకీ ఉవ్వెత్తున లేచినపుడు, గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నపుడూ జట్టుకు వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆటలో నాణ్యతా ప్రమాణాలు, అంకితభావం అతన్ని హాకీకి నిజమైన రాయబారిగా తీర్చిదిద్దాయి’ అని ఈ సందర్భంగా హెచ్‌ఐ అధ్యక్షుడు రాజీందర్ సింగ్ ప్రశంసించాడు. ‘్భరత హాకీ సారథిగాను, తదుపరి ఉత్తమ ఆటగాడిగా యువతరానికి అతను పెద్ద ప్రేరణ. 2014 ఆసియా గేమ్స్‌లో సర్దార్ సింగ్ సారథ్యంలో భారత జట్టు చాంపియన్‌గా నిలవడం ఎప్పటికీ మర్చిపోలేనిది. భారత హాకీలో చోటుచేసుకున్న విప్లవాత్మక ఆట పరిణామాలు, ప్రపంచ ర్యాంకులో జట్టు ఎదుగుదలలో సర్దార్ పాత్ర అనిర్వచనీయం’ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు. ‘్భరత హాకీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన సాధించిన ఘనతకు అభినందనలు. సర్దార్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా సాగాలని హాకీ ఇండియా ఆకాంక్షిస్తోంది’ అన్నాడు. అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్ అవుతున్నట్టు గురువారం చండీగఢ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్దార్ కుటుంబం ప్రకటించింది. భారత హాకీ లెజెండ్ అనిపించుకున్న సర్దార్, తన సారథ్యంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2010, 2014 కామనె్వల్త్ గేమ్స్‌లో రజతాలు, 2007, 2017 ఆసియా కప్‌లో స్వర్ణాలు, 2013 ఆసియా కప్‌లో రజతం, 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం, 2015 రాయ్‌పూర్ వరల్డ్ లీగ్‌లో కాంస్యం, 2011 చాంపియన్స్ చాలెంజ్‌లో రజత పతకాలు సాధించిపెట్టాడు. ఈ ఏడాది బ్రెడాలో జరిగిన ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రజతాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జకార్తాలో జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జట్టులోనూ సర్దార్ సింగ్ భాగస్వామి.