క్రీడాభూమి

ముగింపులోనూ అదే గురి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్వాన్, సెప్టెంబర్ 14: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ టోర్నీ ముగింపులోనూ భారత షూటర్లు పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో సీనియర్ మెన్ స్టాండర్డ్ పిస్టల్ విభాగం నుంచి గురుప్రీత్ సింగ్ రజతాన్ని సాధించాడు. జూనియర్ షూటర్లు మాత్రం రెండు పసిడి పతకాలు సాధించి భారత సత్తా చాటారు. టీం ఈవెంట్‌లో రాజ్‌కన్వర్ సింగ్ సంధు, ఆదర్శ్ సింగ్ సంయుక్తంగా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంటే, జూనియర్ మెన్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో పదహారేళ్ల విజయ్‌వీర్ సిధు అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పసిడి పతకాన్ని సాధించడమే కాదు, టోర్నీకి హైలెట్‌గా నిలిచాడు. టోర్నీలో చెలరేగిన షూటర్లు 11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్‌ను మూడోస్థానంలో నిలిపారు. జూనియర్ మెన్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 572 పాయింట్లతో విజయ్‌వీర్ సిధు అగ్రస్థానంలో నిలిస్తే, కొరియా షూటర్ లీ గున్యాక్ (570), చైనా షూటర్ హోయిజీ ఝూ (565) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అద్భుత ఫాంను ప్రదర్శించి భారత షూటర్లు అంజుమ్ వౌద్గిల్, అపూర్వి చండేలాలు టోక్యో 2020 ఒలింపిక్‌కు నేరుగా అర్హత సాధించడం తెలిసిందే. అక్టోబర్ నుంచి యూత్ ఒలింపిక్ గేమ్స్ షెడ్యూల్ మొదలవుతున్న నేపథ్యంలో, ఈ ఏడాదికి ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలను ముగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ కప్ స్థాయిలో అతి పెద్ద ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ టోర్నీలో అత్యుత్తమ పాయింట్లు సాధించిన షూటర్లు సైతం నేరుగా ఒలింపిక్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.