క్రీడాభూమి

బజరంగ్ గుస్సా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం గుర2వారం ప్రకటించిన అవార్డుల జాబితాలో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కోర్టుకెళతానని హెచ్చరించాడు. గత ఏడాది గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్, జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి సంచలనం సృష్టించిన బజరంగ్ పీటీఐతో మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకోవడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని 2013 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న బజరంగ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం తాను కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి తన గురించి పునరాలోచించాల్సిందిగా కోరుతానని చెప్పాడు. యోగేశ్వర్ దత్ ఇప్పటికే రాథోడ్‌తో మాట్లాడి, ఆయన నుంచి అప్పాయింట్‌మెంట్ తీసుకున్నాడని అన్నాడు. 3అవార్డు కోసం అడుక్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. నిజానికి ఈ విధంగా మంత్రిని కలిసి, అవార్డుకు నా పేరును పరిశీలించాలని కోరడం నా ఉద్దేశం కాదు. రాజీవ్ ఖేల్ రత్నకు నేను అర్హుడినా? కానా? అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను? రాథోడ్‌ను కలిసినప్పుడు ఇదే ప్రశ్న అడుగుతాను2 అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, మంత్రిని కలిసి, అభిప్రాయాలను తెలవడం మినహా తనకు మరో మార్గం లేదని వ్యాఖ్యానించాడు. రెజ్లర్ల కెరీర్ చాలా స్వల్పమని, ఏ చిన్న గాయం తగిలినా ముగుస్తుందని అన్నాడు. గత కొనే్నళ్లుగా నిలకడగా రాణిస్తున్నానని, అందుకు తగిన గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. గతంలో అవార్డుల ఎంపికకు పాయింట్ల విధానం ఉండేది కాదని, కానీ, ఇప్పుడు ఆ పద్ధతి అమల్లో ఉంది కాబట్టి దానినే అనుసరించాలని కోరాడు. ఖేల్ రత్న అవార్డు రాకపోవడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపోయాడు. తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.