క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 28: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరగా, పివి సింధు ఓటమిపాలై నిష్క్రమించింది. రెండో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంక్ క్రీడాకారిణి, హైదరాబాదీ సైనా 21-14, 21-18 తేడాతో నిచావొన్ జిందాపొల్‌ను ఓడించింది. సైనా ఇప్పటి వరకూ జిందాపొల్‌తో 13 పర్యాయాలు ఢీకొని, ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కి ముందు వరుసగా రెండు పర్యాయాలు జిందాపొల్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న సైనా ఈసారి ఆమె ఆధిపత్యానికి గండికొట్టింది. కాగా, మరో హైదరాబాదీ పివి సింధు 21-13, 20-22, 8-21 తేడాతో తాయ్ జూ ఇంగ్ చేతిలో ఓడింది. మొదటి సెట్‌ను గెల్చుకున్న సింధు రెండో సెట్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈరెండు సెట్లు జరిగిన తీరును చూస్తే, కీకలమైన చివరి సెట్‌లో హోరాహోరీ తప్పదన్న అభిప్రాయం కలిగింది. కానీ, సింధు ఆ సెట్‌లో గట్టిపోటీని ఇవ్వలేక ఓటమిపాలైంది. మహిళ సింగిల్స్‌లోనే జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో లీ జురుయ్ 21-16, 18-21, 21-19 స్కోరుతో అకానే యమాగూచీపై గెలిచింది. సయాకా సాంటో 17-21, 21-16, 21-17 ఆధిక్యంతో రచానొక్ ఇంతనాన్‌ను, సంగ్ తిహ్యున్ 21-15, 21-15 తేడాతో ఇప్ పయ్ ఇన్‌ను, వాంగ్ ఇహాన్ 21-13, 21-14 ఆధిక్యంతో లియాంగ్ జియావోయూను, నజోమీ నాకమూర 21-5, 21-9 స్కోరుతో బయే ఇయోన్ జూను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
పురుషుల సింగిల్స్‌లో సీడెడ్ క్రీడాకారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించారు. జుల్ఫద్లి జుల్క్ఫ్లిని చెన్ లాంగ్ 21-12, 21-10, బూన్సాక్ పొన్సానాను టామీ సుగియార్తో 21-17, 21-9, జొనథాన్ క్రిస్టీని వాంగ్ జూ వెయ్ 21-9, 15-21, 21-18, ఇంగ్ కా లాంగ్‌ను తియాన్ హావెయ్ 21-18, 21-14, తకుమా ఉయేదాను చొవ్ తియెన్ చెన్ 21-18, 21-13, వాంగ్ వింగ్‌కీని లీ చాంగ్ వెయ్ 23-21, 21-13, గుయెన్ తియెన్ మిన్‌ను లిన్ డాన్ 21-13, 21-11, హూ యున్‌ను లీ డాంగ్ కుయెన్ 21-11, 17-21, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్స్ చేరారు.