క్రీడాభూమి

బాడ్మింటన్ స్టార్ చాంగ్ వెయ్‌కి కేన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, సెప్టెంబర్ 22: లెజెండరీ బాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వెయ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ముక్కుకు సంబంధించిన కేన్సర్ అతనికి ప్రాథమిక దశలో ఉందని మలేసియా బాడ్మింటన్ సంఘం (బీఏఎం) ఒక ప్రకటనలో తెలిపింది. అతనికి తైవాన్‌లో చికిత్స జరుగుతున్నట్టు వివరించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆసుపత్రి వద్ద ఉన్నట్టు బీఏఎం అధ్యక్షుడు దతుక్ సెరి నొర్జా జకారియా తెలిపాడు. శ్వాసకు సంబంధించిన సమస్యలతో చాంగ్ వెయ్ బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తెలిసిందని, దీనితో అతను అంతర్జాతీయ పోటీల నుంచి కొంతకాలం విరామం ప్రకటించాడని చెప్పాడు. వైద్య పరీక్షల్లో అతనికి కేన్సన్ ఉన్నట్టు తేలిందని, వైద్యానికి అతను సానుకూలంగా స్పందిస్తున్నాడని వివరించాడు. అతనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను బీఏఎం అందిస్తుందని చెప్పాడు.