క్రీడాభూమి

యూత్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్ బాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, అక్టోబర్ 7: యూత్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ పతాకంతో బృందానికి నాయకత్వం వహించే అవకాశం యువ షూటర్ మనూ బాకర్‌కు దక్కింది. బాణాసంచా వెలుగులు, అర్జెంటీనా సాంప్రదాయ నృత్యాలు, కళాప్రదర్శనలతో కన్నుల పండువగా జరిగిన యూత్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక అందరినీ ఆకట్టుకుంది. జట్లను పరిచయం చేసే మార్చ్ఫాస్ట్‌లో పాల్గొనే అదృష్టాన్ని బాకర్ చేజిక్కించుకుంది. కాగా, థాయిలాండ్‌కు చెందిన 3వైల్డ్ బోర్స్2 సాకర్ జట్టు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇటీవల థాయిలాండ్‌ను వరదలు ముంచెత్తినప్పుడు, చాంగ్ రాయ్ ప్రావీన్స్‌లో ఈ జట్టు సభ్యులు ఒక చీకటి గుహలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సుమారు రెండు వారాలు గుహలోనే ఉండిపోయిన 3వైల్డ్ బోర్స్2 సభ్యులను రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద కాపాడారు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి, కష్టకాలంలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా సాయం కోసం ఎదురుచూసి, మృత్యుంజయులుగా బయటకు వచ్చిన ఆ జట్టు క్రీడాకారులకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. యూత్ ఒలింపిక్స్‌లో వారే స్టార్ అట్రాక్షన్ అయ్యారు. ఈనెల 18 వరకూ జరిగే యూత్ ఒలింపిక్స్‌లో 206 దేశాలకు చెందిన 3,997 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతారు. 32 క్రీడలకు సంబంధించి, 241 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి.

చిత్రం..యూత్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో బాణాసంచా వెలుగు.