క్రీడాభూమి

హామిల్టన్ ఖాతాలో జపాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజుకాలో ఆదివారం జరిగిన జపాన్ ఫార్ములా వన్ రేస్ టైటిల్ సాధించిన మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. ఈ ఏడాది కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని మరింత పెంచుకున్న అతను 53 ల్యాప్స్‌ను 1:27 గంటల్లో పూర్తి చేశాడు. అదే జట్టుకు చెందిన వల్టేరి బొతాస్ 12 సెకన్లు ఆలస్యంగా గమ్యాన్ని చేరి, రెండో స్థానంలో నిలిచాడు. మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్)కు మూడో స్థానం దక్కింది. ఈ ఏడాది మరో నాలుగు రేసులు మిగిలి ఉండగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీపడుతున్న సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) కంటే హామిల్టన్ 67 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. అతను ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.