క్రీడాభూమి

ఆసియా పారా గేమ్స్ తర్వాత రిటైర్మెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మన దేశానికి చెందిన ప్రసిద్ధ పారా అథ్లెట్ దేవేంద్ర జాజ్‌హారియా (37) ప్రస్తుతం జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. గత కొంతకాలంగా భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న ఆయన తన మదిలో మెదిలిన రిటైర్మెంట్ గురించి పీటీఐ ప్రతినిధితో తెలిపాడు. 2004 ఏథెన్స్ పారాఒలింపిక్ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో పోటీపడిన దేవేంద్ర గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా ఆ తర్వాత 2016 రియో పారాఒలింపిక్ గేమ్స్‌లో సైతం పాల్గొన్న ఆయన ఇదే విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ‘ఆసియా గేమ్స్ తర్వాత అథ్లెటిక్స్ నుంచి తప్పుకోవాలనే విషయం అంశంపై నా తల్లిదండ్రులు, కోచ్‌లు, స్నేహితులతో చర్చిస్తా. భుజానికి తగిన గాయంతో గత ఏడాదిన్నర కాలంగా పడుతున్న ఇబ్బంది ఏమిటో అనుభవిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను పూర్తిగా కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో నేను కొనసాగాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాను’ అని దేవేంద్ర అన్నాడు. ఆసియా పారా గేమ్స్‌లో భాగంగా ఈనెల 11న జరిగే పోటీలో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన రిటైర్మెంట్ గురించి ఆలోచించి తుదినిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నాడు ఈ ఛాంపియన్ అథ్లెట్. ఆసియా పారా గేమ్స్ తర్వాత 2020లో టోక్యోలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాలా? వద్దా? అనే అంశం గురించి కూడా తుదినిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. కాగా, 2017లో భారత ప్రభుత్వం దేవేంద్రను క్రీడాకారులకు ఇచ్చే ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించింది.