క్రీడాభూమి

యూత్ ఒలింపిక్స్ భారత్ మహిళల హాకీకి తొలి పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, అక్టోబర్ 11: యూత్ ఒలింపిక్స్, మహిళల అండర్-18 హాకీ విభాగంలో భారత్ తొలి పరాజయాన్ని చవిచూసింది. వరుసగా మూడు విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న భారత మహిళలు గురువారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ని 2-5 తేడాతో చేజార్చుకున్నారు. ఆతిథ్య దేశం అన్ని విభగాల్లోనూ అద్భుతంగా రాణించగా, భారత్ అందుకు భిన్నంగా పదేపదే పొరపాట్లు చేసి ఓటమిని కొనితెచ్చుకుంది. మ్యాచ్ ఆరంభమైన ఏడో నిమిషంలోనే అర్జెంటీనాకు సెలినా డి శాంటో ద్వారా తొలి గోల్ లభించింది. ఒక నిమిషం వ్యవధిలోనే భారత క్రీడాకారిణి ముంతాజ్ ఖాన్ గోల్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే, భారత్‌కు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరో రెండు నిమిషాల తర్వాత సోఫియా రమలో అర్జెంటీనాకు రెండో గోల్‌ను అందించింది. ప్రథమార్ధం ముగియడానికి కొద్ది సేపటి ముందు రీత్ భారత్ తరఫున గోల్ నమోదు చేసింది. దీనితో మరోసారి ఇరు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. అయితే, ద్వితీయార్ధంలో భారత్ పోరాటం దాదాపుగా కనిపించలేదు. అర్జెంటీనా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా గోల్స్ చేసే అవకాశాలను దక్కించుకోలేకపోయింది.