క్రీడాభూమి

డెన్మార్క్ ఓపెన్‌కు సింధు, సైనా నాయకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెనె్స (డెన్మార్క్), అక్టోబర్ 15: ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్ డెన్మార్క్‌లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో సింధు మూడో సీడెడ్‌గా, ప్రపంచ నెంబర్ 11 షట్లర్ సైనా అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో యూఎస్‌ఏకు చెందిన బీవెన్ ఝాంగ్‌తో జరిగే ఓపెనింగ్ రౌండ్‌లో సింధు తలపడుతుంది. హాంకాంగ్‌కు చెందిన ఛెంగ్ ఎంగన్ యితో సైనా మొదటి రౌండ్‌లో పోటీ పడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ 6 కిడాంబి శ్రీకాంత్ 7వ నెంబర్ సీడెడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఓపెనింగ్ రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన హాన్స్ క్రిష్టియన్ సొల్‌బెర్గ్ విట్టింగస్‌తో శ్రీకాంత్ తలపడతాడు. భారత్‌కు చెందిన బి.సాయి ప్రణీత్ చైనా ఆటగాడు హాంగ్ యుక్సియాంగ్‌ను ఎదుర్కోనున్నాడు. కాగా, భారత్‌కు చెందిన సమీర్ వర్మ ఓపెనింగ్ రౌండ్‌లో గట్టి పోటీని ఎదుర్కోనున్నాడు. చైనాకు చెందిన మూడో సీడ్ షి యుక్వితో పోరాడనున్నాడు. భారత్‌కు చెంది న మరో షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కోనున్నాడు. తొలి రౌండ్‌లో కొరి యా ఆటగాడు, ఆరో సీడ్ సన్ వాన్ హొతో ప్రణయ్ తలపడతాడు. ఇక పురుషుల డబుల్స్‌లో మను అ త్రి, బి.సుమీత్ రెడ్డి స్థానిక ఆటగాళ్లు కిమ్ ఆస్ట్రుప్, ఆండెర్స్ స్కారప్ రస్‌ముస్సెన్‌లను తొలి రౌండ్‌లో ఎదుర్కోనున్నారు. అశ్విని పొన్నప్ప, సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి కొరియా ద్వయం సియో సెంగ్ జాయె, చా యె యుజంగ్‌తో మహిళల మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లో పోటీ పడతారు. పొన్నప్ప, సిక్కిరెడ్డితో కలసి అమెరికన్ ద్వయం ఏరియెల్ లీ, సిడ్నీ లీలను మహిళల డబుల్స్ ఈవెంట్‌లో ఎదుర్కోనున్నారు.