క్రీడాభూమి

పెరీరాకు విశ్రాంతి..దాసన్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 16: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల నుంచి శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరాను తప్పించి విశ్రాంతి ఇచ్చారు. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్ లియామ్ దాసన్‌ను టోర్నీ నుంచి పూర్తిగా తప్పించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. పెరీరా శనివారం జరిగిన రెండో వనే్డలో 30 పరుగులు చేశాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అతనిని తప్పించారు. అతని స్థానంలో సదీరా సమరవిక్రమను జట్టులోకి తీసుకున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా శనివారం జరిగిన వనే్డలో బౌలింగ్ చేసే సమయంలో కుడి భుజంపై తీవ్రంగా ఒత్తిడి పెరగడంతో ఇంగ్లాండ్ జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లెగ్‌స్పిన్నర్ లియామ్ దాసన్‌ను మొత్తం శ్రీలంక టూర్ నుంచి దూరంగా ఉంచి, అతనిని స్వదేశానికి పంపారు. దాసన్ స్థానంలో జోయ్ డెన్లీని జట్టులోకి తీసుకున్నారు.