క్రీడాభూమి

ఎన్నాళ్లో వేచిన ఉదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 19: విజయం కోసం పరితపించడం మామూలే. కానీ అదే విజయం కోసం కంటి మీద కునుకు లేకుండా గడిపిన రోజులెన్నో.. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు ఎన్నోసార్లు గల్లీ క్రికెట్ ఆడినపుడు సీనియర్లు అతనిని గేలి చేస్తూ ఒక వికెట్ పడగొడితే రూ.10 ఇస్తామంటూ ఆశ చూపేవారు. అలాంటి దుర్భర స్థితి నుంచి క్రికెట్‌లో రాటుదేలిన ఆ 23 ఏళ్ల యువకుడు ఇపుడు భారత్-సీ జట్టులోకి చోటు దక్కించుకున్నాడు. అజింక్య రహానే నాయకత్వంలోని జట్టులో చాన్స్ కొట్టేసి డియోధర్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వస్తున్న ఆ యువకుడే కోల్‌కతాకు చెందిన పపురే. బీహార్ రాష్ట్రంలోని శరణ్ జిల్లా, చప్రాకు 41 కిలోమీటర్ల దూరంలోని ఖజూరీ గ్రామానికి చెందిన పపురే చిన్నపుడే అతని తల్లిదండ్రులు జమ్‌దర్ రాయ్, పార్వతిదేవి ఎన్నో ఏళ్ల క్రితమే బెంగాల్‌కు వలస వెళ్లారు. ట్రక్ డ్రైవర్‌గా పనిచేసే పపు రే తండ్రి గుండెపోటుతో మరణించగా, తల్లి కూడా కొన్నాళ్ల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోయిన పపు రాయ్ కోల్‌కతాలోని పిక్నిక్ గార్డెన్ సమీపంలో మేనమామ, మేనత్తలతో అద్దె కొంపలో ఉంటున్నాడు. పపు రేకి 15 ఏళ్లు ఉన్నపుడు దినసరి కూలీగా పనిచేసే మేనమామ హఠాత్తుగా మరణించడంతో రోజువారీ తిండి కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువతో ఎక్కువగా స్నేహితులతో కలసి గల్లీ క్రికెట్ ఆడేవాడు. ఆటలో సీనియర్లు అతనిని ఆట పట్టించేందుకు ప్రతి వికెట్‌కు 10 రూపాయలు ఇస్తామనడంతో ఒకపక్క ఆశ, మరోపక్క ఆకలి తీర్చుకునేందుకు అనుకున్నది సాధించేవాడు. ఆ విధంగా ఎడమచేతి స్పిన్పర్‌గా రాటుదేలాడు. పేసర్‌గా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి, హౌరా యూనియన్ క్రికెట్ అకాడమీ కోచ్ సుజిత్ సాహా దృష్టిలో పడ్డాడు. అతను ఇచ్చిన సలహాలతో ఎడమచేతిలో స్పిన్ బౌలింగ్ చేయడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు. 2011లో సీఏబీ సెకండ్ డివిజన్ లీగ్‌లో డల్హౌసీ టీమ్ తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి మొత్తం 50 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఒడిషా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించనున్నాడు. సరైన ఆహారంతోపాటు తగి న ఆశ్రయం కల్పించేందుకు తన స్నేహితులైన ముజాక్విర్ అలీ ఖాన్, ఆసిఫ్ ఇక్బాల్ ఖాన్ ముందుకు రావడంతో ప్రస్తుతం ఒడిశానే సొంత ప్రాంతంగా భావిస్తున్నానని అన్నాడు. 2015లో ఒడిశా అండర్-23 టీమ్‌లో చోటుదక్కించుకున్నాడు. అప్పటి సెలక్టర్ సురేష్ కు మార్ సలహాతో మూడేళ్లలోనే లిస్ట్-ఏ క్రికెట్‌కు ఎంపికై గ్రూప్ లీగ్ మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ తన తల్లిదండ్రులు గు ర్తుకొస్తుంటే ఏడుపు వస్తుందని అంటున్నాడు. తన కష్టాలు, క్రికెట్‌లో పడిన శ్రమ, కృషి, పట్టుదల తరచూ గుర్తుకు వస్తుంటాయని అంటా డు. భారత జెర్సీ ధరించాలని కలలుగంటున్న తనకు భారత్-సీ టీమ్‌లో చోటు దక్కడంతో ఆ టలో ఉత్తమంగా రాణించి తన సత్తా ఏమిటో నిరూపిస్తానని అంటున్నాడు పపు రే.