క్రీడాభూమి

దేవధర్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో నిర్వహించే వరల్డ్ కప్‌లో ఆడే లోపల టీమిండియాకు ఇంకా మరో 17 వనే్డ మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. వరల్డ్ కప్‌తోపాటు వచ్చేనెలలో న్యూజిలాండ్ టూర్‌లో జట్టులో చోటుదక్కించుకునేందుకు మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీ చక్కని వేదిక కానుంది. ముఖ్యంగా ఇపుడు అందరి కళ్లూ యువ సంచలనం పృథ్వీ షాపైనే ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో తొలిసారిగా అంతర్జాతీయ టోర్నీలో ఆరంగేట్రం చేసిన పృథ్వీ తన చక్కని ఆటతీరుతో ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్నాడు. అయితే, వెస్టిండీస్‌తో గౌహతిలో ఆదివారం జరిగిన తొలి వనే్డలో అతనికి చోటు దక్కలేదు. అదేవిధంగా సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ సైతం వెస్టిండీస్‌తో జరిగే తదుపరి వనే్డలతోపాటు టీమిండియా ఆడబోయే మిగిలిన 17 వనే్డలలో చోటు కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే దేవధర్ ట్రోఫీలో చూపి న ఆటతీరు ద్వారా ఈ నలుగురు క్రికెటర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది విరామం తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న బౌలర్ రవీంద్ర జడేజా ఇపుడు వనే్డలలోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే, బౌలింగ్‌లో రవీంద్ర జడేజా సహచరుడు 2017 జూలై నుంచి ఇప్పటివరకు టీమిండియా ఆడిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం దక్కించుకోలేకపోయాడు. మంగళవారం జరిగే దేవధర్ ట్రోఫీలో చూపిన ప్రతిభ ఆధారంగా రానున్న వనే్డలతోపాటు వరల్డ్ కప్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు అశ్విన్‌కు అవకాశం కలుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న వనే్డలు, వరల్డ్ కప్‌లో ఆడేందుకు బౌలింగ్‌లో సమర్థులైన క్రికెటర్ల అవసరం ఎంతో ఉంది. ఇండియా-ఏ టీమ్ కెప్టెన్, తమిళనాడుకు చెందిన అశ్విన్ సహచర ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా ఇదే పరిస్థితులను దాదాపుగా ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత జరుగుతున్న వనే్డలలో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది జరిగిన నిదహాస్ ట్రోఫీని భారత్ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి మరో ఆరు బంతులు అవసరం కాగా, ఆఖరి బంతిని సిక్సర్‌గా మలచి ట్రోఫీని అందించడంలో దినేష్ కార్తీక్ పాత్ర మరువలేనిది. ఇపుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న వనే్డలకు దినేష్ కార్తీక్ స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవధర్ ట్రోఫీలో చూపిన ఆటతీరును ప్రాతిపదికగా చేసుకుని వచ్చేనెలలో న్యూజిలాండ్ టూర్‌కు ఎంపిక చేసే టీమిండియాలో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీమిండియా టెస్టుల వైస్‌కెప్టెన్ అజింక్య రహానే కూడా ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత జరిగిన వనే్డలలో చోటు దక్కించుకోలేకపోయాడు. మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే రహానే కూడా దేవధర్ ట్రోఫీతోనే మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాల్సి ఉం టుంది. అంబటి రాయుడు మాదిరిగానే జట్టులో రహానే నాలుగో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది.