క్రీడాభూమి

కోహ్లీ అసలు మనిషేనా! : తమీమ్ ఇక్బాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అసలు కోహ్లీ మనిషేనా అన్న అనుమానం తనకు కలుగుతుందని వ్యాఖ్యానించాడు. 3అతని ఆటతీరు, మైదానంలో అతని బ్యాటింగ్ విధానం, ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించడం వంటి అంశాలు చూస్తుంటే కోహ్లీ అసలు మానవమాత్రుడేనా అన్న అనుమానం కలుగుతోంది2 అని ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. 3కోహ్లీ నుంచి ప్రేరణ పొందవచ్చు. అతనో అద్భుత ఆటగాడు. అతనిని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఫార్మాట్ ఎలాంటిదైనా నెంబర్ వన్‌గా నిలిచేందుకు ప్రయత్నిస్తాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటగాడు2 అని పేర్కొన్నాడు. 3గత 12 ఏళ్లుగా నేను ఎంతోమంది గొప్ప క్రికెటర్లను చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. వారందరికంటే కోహ్లీ భిన్నమైన ఆటగాడు. అందర్నీ డామినేట్ చేసే శక్తిసంపన్నుడు2 అని ఇక్బాల్ పొగిడాడు. కాగా, గత నెలలో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంకతో తలపడిన ఒక మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు ఇక్బాల్.

చిత్రం..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ