క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్‌లో సైనా, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 24: భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో చోటు దక్కించుకున్నారు. గతవారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో జపాన్‌కు చెందిన సయెనా కవాకమిని 21-11, 21-11 తేడాతో ఓడించింది. ప్రపంచ 10వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లో గత ఏడాది వరల్డ్ చాంపియన్, జపాన్‌కు చెందిన నొజొమి ఒహుకురా లేదా స్పెయిన్‌కు చెందిన బీట్రిజ్ కొర్రాలెస్‌తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ హాంగ్‌కాంగ్‌కు చెందిన వంగ్ వింగ్ కి వినె్సంట్‌ను 21-19, 21-13 తేడాతో ఓడించాడు. ప్రపంచ 5వ సీడ్ ఆడగాడు శ్రీకాంత్ తన తదుపరి రౌండ్‌లో కొరియా ఆటగాడు లీ డాంగ్ కెయున్‌ను పోటీపడతాడు. ఇదిలావుండగా, గతవారం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న భారత్ షట్లర్ సమీర్ వర్మ ఇండోనేషియా ఆటగాడు, ఆసియా గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జొనాటన్ క్రిస్టీ చేతిలో 21-16, 17-21, 15-21 తేడాతో ఓటమి చెందాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మను అత్రి, బి.సుమీత్‌రెడ్డి కొరియా ద్వయం మిన్ హైయుక్ కాంగ్, కిమ్ వన్ హోలను 21-18, 21-17 తేడాతో ఓడించారు.