క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు, సైనా, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 26: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, మహిళల, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ దూసుకువెళ్తున్నారు. గురువారం రాత్రి వేర్వేరుగా జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లలో వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నారు. మూడో సీడ్ క్రీడాకారిణి సింధు జపాన్‌కు చెందిన సయాకా సాటోపై 21-17, 21-16తో పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లోని రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్ జపాన్‌కు చెందిన నజొమీ ఒకురాపై 10-21, 21-14, 21-17 విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్‌తో తలపడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ లీ డాంగ్ కెయున్‌ను 12-21, 21-16, 21-18 తేడాతో ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 1 కెంటో మొమోటోతో శ్రీకాంత్ తలపడతాడు. మరోపక్క పురుషుల సింగిల్స్‌లో పోటీపడిన బి.సాయి ప్రణీత్ నిరాశపరిచాడు. ఆసియా గేమ్స్ చాంపియన్ జొనాటన్ క్రిస్టీ చేతిలో 16-21, 14-21 తేడాతో ఓటమి చెంది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, మనుఅత్రి-బి.సుమీత్ రెడ్డి ప్రత్యర్థులపై గెలుపుద్వారా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నారు.