క్రీడాభూమి

భువీ, బుమ్రా తిరిగొచ్చేలా ఒత్తిడి చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌తో జరిగిన రెండో వనే్డలో భారీ స్కోరును ఛేదించే యత్నంలో ఆఖరిక్షణంలో మ్యాచ్ టైగా ముగించడంలో కాస్త నిరుత్సాహానికి గురైనా తమ ఆటగాళ్లు ప్రత్యర్థి టీమ్‌లోని పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా తిరిగొచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ లా అన్నాడు. గౌహతి, విశాఖపట్టణంలో జరిగిన రెండు వనే్డలలో ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ వంటివారు టీమిండియా ఆశించిన విధంగా ఆకట్టులేకపోవడం వెనుక తమ బ్యాట్స్‌మెన్‌లు బాగా రాణించారనేందుకు నిదర్శనమని అన్నాడు. రెండు వనే్డల్లోనూ భారీ లక్ష్యాలను నిర్దేశించినా రెండు జట్లు అందుకు తగ్గట్టు ఆటతీరును ప్రదర్శించాయని పేర్కొన్నాడు. అయితే, ఆతిధ్య బౌలర్లపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఇద్దరు పేసర్లు భువీ, బుమ్రా మళ్లీ వనే్డల్లోకి వచ్చేలా తమ ఆటగాళ్లు ఒత్తిడి తెచ్చారన్నది నిర్వివాదాంశమని అభిప్రాయపడ్డాడు. ఎంతో బలమైన జట్టులోని బౌలర్లు ఆశించిన విధంగా రాణించలేకపోవడంతోనే వనే్డ స్పెషలిస్టులుగా పేరుగాంచిన పేసర్లను భారత్ మళ్లీ జట్టులోకి తీసుకువచ్చిందని, ఇలా ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినందుకు తమకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడును ఎలా అడ్డుకుంటారన్న ప్రశ్నకు స్టువర్ లా మాట్లాడుతూ అందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నాడు. కోహ్లీ అద్భుత ఆటగాడని, అతని పట్టుదల, అంకితభావం, గొప్పవని ప్రశంసించాడు. కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతమని అంటూ అతను కూడా మానవమాత్రుడేనని, అతని దూకుడును అడ్డుకునేందుకు తమకు అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. తమ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మెయిర్ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నందుకు అభినందిస్తూ షాయ్ హోప్ రెండో వనే్డలో ఆడిన ఆటతీరును కోచ్ స్టువర్డ్ లా ప్రస్తుతించాడు.