క్రీడాభూమి

గవాస్కర్, మంజ్రేకర్‌కు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 6: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రకర్‌కు తీవ్ర ప్రమాదం తప్పింది. మంగళవారం ఇక్కడి ఎకనా స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్ సందర్భంగా అపశృతి దొర్లింది. కామెంటరీ బాక్స్‌లో డోర్ అద్దాలు అమాంతం విరిగిపడడంతో అప్పుడే అందులోకి ప్రవేశించబోతున్న గవాస్కర్, మంజ్రేకర్ ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన తర్ప్వాత మంజ్రేకర్ మీడియాతో మాట్లాడుతూ అదృష్టవశాత్తూ తామిద్దరం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులదే ఇందుకు పూర్తి బాధ్యత అని వ్యాఖ్యానించాడు. 50వేల మంది సామర్ధ్యం కలిగిన ఈ స్టేడియం మంగళవారం నాటి మ్యాచ్‌లో పూర్తిగా నిండిపోయింది. 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇపుడు అంతర్జాతీయ పోటీలకు వేదిక అయిన ఈ ఎకనా స్టేడియం పేరును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మ్యాచ్ జరగడానికి ఒకరోజు ముందు దివంగత అటల్ బిహారీ వాజపేయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చుతూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.