క్రీడాభూమి

విండీస్‌కు వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 6: భారత పర్యటనలో ఆతిధ్య వెస్టిండీస్‌కు వైట్‌వాష్ తప్పలేదు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌తోపాటు తాజాగా జరిగిన టీ-20 సిరీస్‌లను టీమిండియా చేజిక్కించుకోవడం ద్వారా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఈ రెండు జట్ల మధ్య లక్నో ఇకానా స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 195 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రికార్డులను తిరగరాశాడు. టీ-20లలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సాధించిన (2102) పరుగులను రోహిత్ అధిగమించాడు. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ చేసిన సిక్సర్లు, బౌండరీల వర్షంతో ఇనాకా స్టేడియం తడిసి ముద్దయింది. కెప్టెన్‌కు తోడుగా ధావన్ దూకుడుగా ఆడి పరుగుల వరద పారించాడు. అయితే, 13 ఓవర్ ఆఖరి బంతికి ధావన్‌ను ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న ధావన్ 3 బౌండరీలతో 43 పరుగులు చేసి, ఫబియాన్ అలెన్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న పంత్ 1 ఫోర్‌తో 5 పరుగులు చేసి, ఖారీ ప్లెర్రే బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. పంత్ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కెప్టెన్‌కు చివరి వరకూ తోడుగా నిలిచాడు. రోహిత్ శర్మ 61 బంతుల్లో 7 సిక్సర్లు, 8 బౌండరీలతో 111 పరుగులు, కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 1 సిక్సర్, 2 బౌండరీలతో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో ఖారీ ప్లెర్రే, ఫబియాన్ అలెన్ తలో వికెట్ తీసుకున్నారు.
ప్రత్యర్థి తమ ముందు ఉంచిన భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఓపెనర్ షాల్ హోప్ 6 8 బంతుల్లో 1 సిక్సర్‌తో 6 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. షిమ్రాన్ హెట్‌మెయిర్ 14 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 15 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. డారెన్ బ్రేవో 18 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలతో 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. 3 బంతులు ఎదుర్కొన్న నికోలస్ పూరన్ 1 బౌండరీతో 4 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ డెనేష్ రామ్‌దిన్ 7 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రోహిత్ చేతిలో ఔటయ్యాడు. ఫబియాన్ అలెన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌గా వెనుతిరిగాడు. 21 బంతులు ఎదుర్కొన్న కీమో పాల్ 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. 4 బంతులు ఎదుర్కొన్న ఖారీ పెర్రే 1 పరుగు చేసి బుమ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ 9 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్‌తో 15 పరుగులు, ఒషానే థామస్ 4 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహమ్మద్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.