క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 14: భారత షట్లర్, ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు, మరో షట్లర్ సమీర్ వర్మ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్‌లో మహిళలు, పురుషుల సింగిల్స్ విభాగంలో శుభారంభం అందించి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. బుధవారం గంటకు పైగా జరిగిన ఓపెనింగ్ రౌండ్‌లో మూడో సీడ్ సింధు థాయిలాండ్ క్రీడాకారిణి నిచాన్ జిందాపోల్‌ను 21-15, 13-21, 21-17 తేడాతో ఓడించింది. ఇదే ప్రత్యర్థిపై సింధు ఇప్పటికి నాలుగుసార్లు పైచేయి సాధించింది. తదుపరి రౌండ్‌లో కొరియా షట్లర్ సుంగ్ జి హైయున్‌తో సింధు తలపడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ థాయ్ క్రీడాకారుడు సుపన్యు అవిహింగ్సనన్‌ను 21-17, 21-14 తేడాతో ఒడించి రెండో రౌండ్‌లో చోటుదక్కించుకున్నాడు.