క్రీడాభూమి

కొనసాగుతున్న భారత భాక్సర్ల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇక్కడి కేడీ జాదవ్ స్టేడియంలో జరుగుతున్న ఏఐబీఏ మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా అప్రతిహతంగా దూసుకుపోతోంది. సోమవారంనాటికి 8 మంది బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. సోనియా చాహల్ (57 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నారు. అయితే, ఈసారి మెడల్ తప్పనిసరిగా తీసుకువస్తుందన్న భారీ అంచనాలతో బరిలోకి దిగిన సవీడీ బూరా (75 కేజీలు) కేవలం ఒక్క అడుగు దూరంలో విజయానికి దూరమై నిరాశపరిచింది. మరోపక్క ప్రపంచ మాజీ చాంపియన్, దిగ్గజ బాక్సర్ ఎం.సీ.మేరీ కోమ్ (48 కేజీలు), మనీషా వౌన్ (54 కేజీలు), లవ్‌లినా బోర్గోహెయిన్ (69 కేజీలు), కచారీ భాగ్యబతి (81 కేజీలు) ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. సీమా పూనియా మంగళవారం చైనా బాక్సర్ జియావోలీ యాంగ్‌తో తలపడుతుంది. సోమవారం 51 కేజీల విభాగంలో తలపడిన హర్యాలోని హిసార్‌కు చెందిన 28 ఏళ్ల పింకీ రాణి ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎలీసె ఎబోనీ జోన్స్‌పైన, 23 ఏళ్ల సిమ్రాన్‌జిత్ కౌర్ స్కాట్‌లాండ్ బాక్సర్ మెగాన్ రెయిడ్‌పైన, హర్యానాకు చెందిన 21 ఏళ్ల సోనియా చాహల్ 67 కేజీల విభాగంలో మాజీ చాంపియన్, బల్గేరియాకు చెందిన స్టాన్‌మిరా పెట్రోవాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు.
నిరాశపరిచిన సవితీ బూరా
భారత మహిళా బాక్సర్ సోనియా చాహల్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోని 57 కేజీల విభాగంలో జరిగిన పోటీలో పోటీ పడిన 21 ఏళ్ల సోనియా తన ప్రత్యర్థి, బల్గేరియాకు చెందిన 2014 గోల్డ్‌మెడలిస్టు స్టాన్‌మిరా పెట్రోవాను 3-2 తేడాతో ఓడించింది. 21 ఏళ్ల సోనియా హర్యానాకు చెందిన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఇదిలావుండగా, 75 కేజీల విభాగంలో పోటీపడిన మరో భారత బాక్సర్ 23 ఏళ్ల సవితీ బూరా నిరాశపరిచింది. పోలాండ్ బాక్సర్ ఎల్జిమెతా వొజ్‌సిక్ చేతిలో ఓడిపోయింది.
రిఫరీల నిర్ణయం తప్పు: భారత బాక్సింగ్ కోచ్ శివ్ సింగ్
ఏఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు సరితాదేవి, సవితీ బూరా విషయంలో మ్యాచ్ రిఫరీల నిర్ణయాన్ని భారత బాక్సింగ్ కోచ్ శివ్ సింగ్ ప్రశ్నించాడు. 60 కేజీల విభాగంలో పోటీపడిన ప్రపంచ మాజీ చాంపియన్ సరితాదేవి ఐర్లాండ్ బాక్సర్ కెల్లీ హరింగ్టన్ చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. 75 కేజీల విభాగంలో పోటీపడిన మరో భారత బాక్సర్ సవితీ బూరా పోలాండ్ బాక్సర్ ఎల్జిబిటా వొవ్‌జిక్ చేతిలో 5-0తో పరాజయం పాలైంది. ఈ రెండు సంఘటనల్లో రిఫరీలు తీసుకున్న నిర్ణయం సరికాదని భారత కోచ్ వ్యాఖ్యానించాడు. అయితే, భారత అథ్లెట్ల ఓటమిపై మాట్లాడేందుకు నిరాకరించాడు. మ్యాచ్‌లలో స్టాండింగ్ కౌంట్స్ అనేవి రిఫరీలపై ఒత్తిడి తీసుకువస్తాయని, దీనివల్ల ప్రత్యర్థులవైపే వారు మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. మూడో రౌండ్‌లో రిఫరీలు ప్రత్యర్థికి అదనపు పాయింట్ల ఇచ్చారని, దీంతో తమ బాక్సర్ ఓడిపోయిందని పేర్కొన్నాడు. 2014లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైతం రిఫరీల నిర్ణయాన్ని తప్పుపట్టిన సరితాదేవి ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంది. మళ్లీ ఇపుడు ఆమె విషయంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తనకు అర్ధం కావడం లేదని అన్నాడు. ఆదివారం జరిగిన పోటీలో ఐర్లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయిన తర్వాత రిఫరీల తప్పుడు నిర్ణయం వల్లే తాను పరాజయం పాలయ్యానని వ్యాఖ్యానించిన సరితాదేవి ఆ తర్వాత రిఫరీల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. ఏదేమైనా రిఫరీల నిర్ణయంతో తాను సంతృప్తిగా లేనని వ్యాఖ్యానించింది.
బల్గేరియా బాక్సింగ్ కోచ్‌పై సస్పెన్షన్ వేటు
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ సందర్భంగా తమ దేశ బాక్సర్ ఓటమిని సహించలేక రింగ్‌లోకి బాటిల్‌ను విసిరి క్రీడా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు బల్గేరియా కోచ్ పీటర్ లెసోవ్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఇక్కడ జరుగుతున్న ఏఐబీఏ మహిళల ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా 57 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో తలపడిన భారత బాక్సర్ సోనియా చాహల్ చేతులో బల్గేరియా బాక్సర్ స్టాన్‌మిరా పెట్రోవా ఓడిపోయింది. అయితే, రిఫరీల తీరును బల్గేరియా బాక్సర్ తప్పుపట్టడమే కాకుండా వారిని వేలెత్తిచూపింది. పెట్రోవా మాజీ గోల్డ్ మెడలిస్టు కావడం గమనార్హం.
ఆమె కోచ్, ఒలింపిక్ చాంపియన్ పీటర్ లెసొవ్ సోమవారం బాక్సింగ్ రింగ్‌లోకి ఒక బాటిల్‌ను విసిరడమే కాకుండా ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన తీర్పును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశాడు. 27 ఏళ్ల బల్గేరియా బాక్సర్ పెట్రోవా 2014 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 54 కేజీల విభాగంలో గోల్డ్‌మెడల్ అందుకుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో భారత బాక్సర్ 21 ఏళ్ల సోనియా చేతిలో 2-3 తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం బల్గేరియా కోచ్ రిఫరీల నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాకుండా మీడియా ముందుకు రావడంతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) జరిగిన మ్యాచ్‌ను పునపరిశీలించింది. ఫలితంగా బల్గేరియా కోచ్‌ను ఈనెల 24వరకు జరిగే పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా అతని అక్రిడిటేషన్‌ను సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

చిత్రాలు.. భారత బాక్సర్ పింకీ రాణి ఫ్లై కేటగిరి (51 కేజీలు) ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ బాక్సర్ ఎబోనీ జోన్స్‌పై గెలుపొందిన దృశ్యం

* వెల్టర్ వెయిట్ కేటగిరి (64 కేజీలు) ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో స్కాట్‌లాండ్ బాక్సర్ మెగాన్ రెయిడ్‌పై పంచ్ విసురుతున్న భారత బాక్సర్ సిమ్రాన్‌జిత్ కౌర్