క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో అత్యధికంగా మెడల్స్ సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: వచే చ ఒలింపిక్స్‌లో అత్యధికంగా మెడల్స్ గెలిచే ప్రపంచ దేశాల్లో భారత్‌కూడా ఒకటిగా ఉంటుందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మంగళవారం నాడిక్కడ ధీమా వ్యక్తం చేశారు. క్రీడల లక్ష్యాల సాధన విషయంలో భారత్‌కు 2018 అత్యద్భుత సంవత్సరంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో భారత యువశక్తి క్రీడల్లో అనేత అద్భుతాలు సాధించి ప్రపంచాన్ని శాసిస్తుందన్న నమ్మకం తనకు ఏర్పడిందని ఇక్కడికి సమీపంలోని సంఖలిమ్ గ్రామం వద్ద సేషా ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన రాథోర్ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. 2020 ఒలంపిక్స్‌లో మన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. 2024 వేసవి ఒలంపిక్స్ పారిస్‌లోనూ, 2028 క్వాడ్రెన్నియల్ ఒలంపిక్ గేమ్స్ లాస్ ఏంజెల్స్‌లోనూ జరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో భారత క్రీడాకారులు అనేక ఈవెంట్లలో తమ ప్రత్యేక ముద్రను వేశారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కామనె్వల్త్, ఆసియన్, పారా ఆసియన్ గేమ్స్‌లోనూ, యూత్ ఒలంపిక్ గేమ్స్‌లోనూ మన క్రీడాకారులు మరచిపోలేని ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ఇదివరకెన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో మెడల్స్ సాధించారని రాథోర్ ఆనందం వ్యక్తం చేశారు.