క్రీడాభూమి

ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌత్ (ఆంటిగ్వా), నవంబర్ 23: ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20లో లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకు అప్రతిహతంగా దూసుకెళ్లి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియాకు సెమీఫైనల్స్‌లో నిరాశ ఎదురైంది. గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఐసీసీ వరల్డ్ టీ-20 సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న కలలు అడియాశలయ్యాయి. ఫలితంగా 8 వికెట్ల తేడాతో అదే ప్రత్యర్థి చేతిలో ఓటమిని మూటకట్టుకుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుని 19.3 ఓవర్లలో 112 ఆలౌటైంది. స్మృతి మంధాన, జమీమా రోడ్రిగ్స్ మినహా మిగిలిన బ్యాట్స్‌ఉమెన్‌లెవరూ ఆశించిన పరుగులు చేయలేక చతికిలపడ్డారు. ఓపెనర్ స్మృతి మంధాన 23 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 5 బౌండరీలతో 34 పరుగులు చేసి సోఫియా ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చింది. 19 బంతులు ఎదుర్కొన్న మరో ఓపెనర్ తానియా భాటియా 11 పరుగులు చేసి హీథర్ నైట్ బౌలింగ్‌లో నటాలీ సిల్వర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. జమీమా రోడ్రిగ్స్ 26 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 26 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరిగింది. 5 బంతులు ఎదుర్కొన్న వేదా కృష్ణమూర్తి 2 పరుగులు చేసి క్రిస్టీ గోర్డోన్ బౌలింగ్‌లో జోన్స్‌కు క్యాచ్ ఇచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్‌తో 16 పరుగులు చేసి క్రిస్టీ గోర్డోన్ బౌలింగ్‌లో నటాలీ సిల్వర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. దయాలన్ హేమలత 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి హీథర్ నైట్ బౌలింగ్‌లో బీవౌంట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. అనుజూ పాటిల్ 1 బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే హీథర్ నైట్ బౌలింగ్‌లో ఎల్.విన్‌ఫీల్డ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. 4 బంతులు ఎదుర్కొన్న రాధాయాదవ్ 4 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరిగింది. అరుంధతిరెడ్డి 5 బంతులు ఎదుర్కొన్న 1 ఫోర్‌తో 6 పరుగులు చేసి స్టంపవుట్ అయింది. దీప్తిశర్మ 10 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరిగింది. పూనమ్ యాదవ్ 1 బంతిని ఎదుర్కొని నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో హీథర్ నైట్ 2 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, సోఫీ ఎకెల్‌స్టోన్ 3.3 ఓవర్లలో 22, క్రిస్టీ గోర్డోన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 113 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించి 17.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ దారిపట్టగా జట్టును ఫైనల్స్‌కు చేర్చే బాధ్యతను మరో ఇద్దరు బ్యాట్స్‌ఉమెన్‌లు తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఓపెనర్ డేనియల్లీ వ్యాట్ 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో జమీమా రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. 3 బంతులు ఎదుర్కొన్న టామీ బ్యూవౌంట్ 1 పరుగు చేసి రాధా యాదవ్ బౌలింగ్‌లో అరుంధతిరెడ్డికి క్యాచ్ ఇచ్చింది. వికెట్ కీపర్ ఆమీ ఎల్లెన్ జోన్స్ 47 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 3 ఫోర్లతో 53, నటాలీ స్లీవర్ 38 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ 4 ఓవర్లలో 24 పరుగులు, రాధా యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.