క్రీడాభూమి

రియో లోటు బాధిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని, దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరోసారి విజేతగా నిలిచిన భారత దిగ్గజం, సూపర్ బాక్సర్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. మ్యాచ్ తర్వాత రింగ్ నుంచి బయటకు రావడంతో స్టేడియంలో కిక్కిరిసిన జనసమూహంతో పాటు అధికారులు చుట్టుముట్టి అభినందనలు తెలిపారు. ప్రపంచ టోర్నమెంట్‌లో మువ్వనె్నల జెండాను సగర్వంగా ఎగురవేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ ఘనత సాధించేందుకు మొదటనుంచి తనకు సంపూర్ణ మద్దతు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నది. టోర్నీ ఆసాంతం తనకు ఎన్నో మెలకువలు నేర్పిన కోచ్‌తోపాటు బాక్సింగ్ సిబ్బందికి సైతం ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈ అఖండ విజయంతో ఉద్వేగానికి గురయ్యాను. మీ ప్రేమ, అభిమానంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది.’