క్రీడాభూమి

మహిళల టీ-20 చాంప్ ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంటిగువాలో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఆసీస్ 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. డానియేలా వయాట్ (43), హీథర్ నైట్ (25) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లకు చేరుకోలేకపోయారు. ఆష్లే గార్డ్‌నర్ 22 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆస్ట్రేలియా 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఆష్లే హీలీ 22, బెన్ మూనీ 14 పరుగులు చేసి అవుట్‌ కాగా, ఆష్లే గార్డ్‌నర్ 33, మెగ్ లానింగ్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

చిత్రాలు.. ట్రోఫీతో అస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్